ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబం ఆంటే తెలియని వారు లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి గా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు ఎంత మేలు చేసారో నేటికి చాల మంది మరచిపోయి ఉండరు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో పార్టీ ఏర్పాటు చేసి తరువాత అన్నింటినీ పక్కన పెట్టిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రస్తుతం బీజేపీ నుంచి ఓ పెద్ద పదవి వరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి వాయల్పాడు నియోజకవర్గం ఎమ్మెల్యే గా మృతి చెందారు. అమర్నాథ్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 1978 ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీ ఫారం ఇచ్చారు. ఆయన మరణంతో కిరణ్ కుమార్ రెడ్డి తల్లి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైంది. 1989లో తొలిసారి ఎమ్మెల్యే.. ఆ తరువాత ఓటమి చవి చూసారు.
అనంతరం 1999, 2004, 2009 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చీఫ్ విప్ గా, స్పీకర్ గా కూడా పదవులు అధిరోహించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంచి క్రికెటర్ , అజహరుద్దీన్ తో కలసి వివిధ స్థాయిల్లో క్రికెట్ ఆడారు. తండ్రి అమర్ నాథ్ రెడ్డి మరణంతో రాజకీయాల్లోకి అనివార్యంగా ప్రవేశించారు. నిజాం కాలేజీలో నందమూరి బాలకృష్ణ.. కిరణ్ కుమార్ రెడ్డి కలిసి చదువుకున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2010 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రి గా పని చేశారు.ఆయన సొంత పార్టీ పెట్టి ఓటమి పాలైన తరువాత గత ఎన్నికల వరకు ఎక్కడ పెద్దగా కనిపించలేదు.2024 ఎన్నికల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరుపున రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
తన ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై పోటీ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి తన వాక్చాతుర్యం తో రాజంపేట పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తూ వైసీపీ నాయకులకు నిద్ర లేకుండా చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై విమర్శలు చేస్తూ ముందుకు సాగారు. పెద్దిరెడ్డి సైతం కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్ పై స్పందించే రీతిలో ప్రసంగించారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తో జిల్లా రాజకీయాల్లో ఢీ అంటే ఢీ అంటూ పైచేయి సాధించారు.
గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ నుండి కిరణ్ కుమార్ రెడ్డి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన.. తన తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ని పీలేరు ఎమ్మెల్యే గా గెలిపించారు. పావు నరసింహారావు ఆశీస్సులతో ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలనే కోరిక కిరణ్ కుమార్ రెడ్డి తండ్రికి ఉన్నా అది నెరవేరలేదు... తండ్రిఆశయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి నెరవేర్చారు. తన ఇంట్లో అధికారం ఉన్నా లేకపోయినా నియోజకవర్గంలో అభివృద్ధి, నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. నేటికి నియోజకవర్గ పర్యటనలు చేస్తున్నారు. తమ ఇంటి గడప వద్దకు వచ్చి ఏమి కావాలనే అడిగితే అది జరుగుతుంది అన్నది నియోజకవర్గ ప్రజల మాట. కిరణ్ కుమార్ రెడ్డి అనుభవం దృష్ట్యా బీజేపీ పార్టీ ఆయనకు అత్యున్నత స్థాయి పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nallari-kiran-kumar-reddy-pileru-39-199089.html
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.