నాగబూబుకు కేబినెట్ హోదాతో కీలక పదవి.!
Publish Date:Aug 17, 2026
Advertisement
జనసేన నాయకుడు కొణిదెల నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ.. ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ సోమవారం (ఆగస్టు 17) ఉత్తర్వులు ారీ చేసింది. రాష్ట్రంలో పచ్చదనం పెంచడం, పర్యావరణ సమతుల్యత కాపాడటమే ధ్యేయంగా ఈ గ్రీన్ కార్యని ర్వాహక కమిటీ ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్తంగా అడవుల విస్తీర్ణాన్ని పెంచే ప్రక్రియలో భాగంగా నాగ బాబు నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. నాగబాబు సారథ్యంలో గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, పర్యావరణ పరిరక్షణ దిశగా చేపడుతున్న కార్యక్రమాలు, మొక్కలు నాటే ప్రాజెక్టులను పరిశీలిస్తుంది. అలాగే వాటి పురోగతిని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పర్యావరణానికి అనుకూలమైన విధానాలను రూపొందించడంతో పాటు ప్రకృతి వనరుల సంరక్షణకు అవసరమైన వ్యూహాలను అమలు చేయడంలో ఈ కమిటీ ప్రభుత్వం తరఫున పని చేస్తుంది. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, హరిత విప్లవం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంగా ఈ కమిటీ ఏర్పాటు, కమిటీ చైర్మన్ గా నాగబాబు నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. జల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపొందించే దిశగా నాగబాబు ఎలాంటి చర్యలు చేపడతారనే అంశంపై వ్యాపకంగా ఆసక్తి నెలకొంది. Naga Babu, AP Green Executive Committee, Andhra Pradesh Government, Cabinet Rank, Janasena Leader Naga Babu
http://www.teluguone.com/news/content/naga-babu-25-229070.html





