జగన్ కు రఘురామ మరో షాక్! హైకోర్టులో పిటిషన్ తో కాక.. 

Publish Date:Jun 22, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పోరాటం సాగిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ రాజు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలు, జగన్ ఎన్నికల హామీలపై రోజుకో లేఖ రాస్తూ కాక రేపుతున్న రఘురామ.. తాజాగా జగన్ రెడ్డి వ్యాపారాలపై ఫోకస్ చేసినట్లు  కనిపిస్తోంది. సీఎం జగన్ కంపెనీపై ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్‌ లీజు పొడిగింపుని సవాల్‌ చేస్తూ ఆయన  పిటిషన్‌ వేశారు. 

సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్ లీజ్‌లో అక్రమాలు జరిగాయని గతంలో  సీబీఐ నిర్ధారించిందని తన పిటిషన్ లో చెప్పారు ఎంపీ రఘురామ.  సీబీఐ కేసును ప్రస్తావించకుండా హైకోర్టులో లీజ్ పొడిగింపునకు అనుమతి పొందడాన్ని  రఘురామ పాయింట్ చేశారు. సీబీఐ కేసు దాఖలు చేసిన కంపెనీకి లీజు ఎలా పొడిగిస్తారని రఘురా తన  పిటిషన్‌లో ప్రశ్నించారు. జగన్ సొంత కంపెనీ కావటంతో అధికారులు నిబంధనలు ఉల్లఘించి అనుమతులు ఇచ్చారని  పేర్కొన్నారు.  సరస్వతి కంపెనీ, పరిశ్రమలశాఖ, మైనింగ్ శాఖ, ఏపీ పొల్యూషన్ బోర్డులను తన వ్యాజ్యంలో ప్రతివాదులుగా  చేర్చారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. రఘురామ పిటిషన్ పై త్వరలోనే హైకోర్టులో విచారణ జరగనుంది. 

‘గ్రంధి ఈశ్వరరావు 1999లో సరస్వతి కంపెనీని ఏర్పాటు చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతిరెడ్డి, మరో ఇద్దరు ఆ కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. తర్వాత ఒరిజినల్‌ ప్రమోటర్లు కంపెనీని విడిచిపెట్టారు. గుంటూరు జిల్లాలో 266 హెక్టార్లు లైమ్‌స్టోన్‌ ప్రాస్పెక్టింగ్‌ లీజుకోసం 2008 మార్చి, ఏప్రిల్‌లలో కంపెనీ దరఖాస్తు చేసింది. మైనింగ్‌ లీజు కోసం దరఖాస్తు చేసుకున్నాక మెమోరాండం ఆఫ్‌ అసోసియేషన్‌ను కంపెనీ సవరించింది. మైనింగ్‌ లీజు దరఖాస్తును అధికారులు స్వీకరించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ప్రభుత్వం  మైనింగ్‌ లీజును మంజూరు చేసింది. ఆ కంపెనీ ముఖ్యమంత్రి కుమారుడు, కోడలు, భార్యది కావడంతో అధికారులు అనుమతులిచ్చారు.మైనింగ్‌ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో 2014లో అప్పటి ప్రభుత్వం యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. కంపెనీ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని అధికారులు.. మైనింగ్‌ లీజు మురిగిపోయినట్లుగా (ల్యాప్స్‌) ప్రకటిస్తూ అక్టోబరు 9న ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ కంపెనీ అప్పట్లో హైకోర్టులో వ్యాజ్యం వేసింది. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్‌మోహన్‌రెడ్డి క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారంటూ సీబీఐ దర్యాప్తు నిర్వహించింది. జగన్‌మోహన్‌రెడ్డి సంపద రూ.11 లక్షల నుంచి రూ.45వేల కోట్లకు పెరిగిందని కనుగొంది. ఈ వ్యవహారంలో 2012-14 సంవత్సరాల్లో సీబీఐ.. జగన్‌మోహన్‌రెడ్డిపై 11 అభియోగ పత్రాలను దాఖలు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ 6 ఛార్జిషీట్లు వేసింది. అవి న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా మైనింగ్‌ లీజు మంజూరులో అక్రమాలు జరిగాయని సీబీఐ కనుగొంది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, లీజు కాలపరిమితి ముగిసినదిగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని సీబీఐ కోరింది. మైనింగ్‌ లీజు కాలపరిమితి ముగిసినట్లుగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యంలో 2019 సెప్టెంబరు 30న ప్రభుత్వం తూతూ మంత్రంగా కౌంటర్‌ వేసింది. సీబీఐ విచారణలో వెల్లడైన వివరాల్ని కోర్టు ముందు ఉంచలేదు. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు ఏజీ.. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారు. కోర్టును తప్పుదోవ పట్టించారు. ఈ నేపథ్యంలో సింగిల్‌ జడ్జి.. రిట్‌ను అనుమతించారు. లీజు కాలపరిమితి ముగిసినట్లు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. మైనింగ్‌ లీజును పునరుద్ధరించాలని ఆదేశించారు. సరస్వతి కంపెనీకి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మోసపూరితంగా వ్యవహరించినప్పుడు.. ఆ విషయాన్ని పౌరుడిగా న్యాయస్థానం దృష్టికి తేవాల్సి ఉంది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయండి’ అని రఘురామ తన పిటిషన్ లో కోరారు.
 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.