జర్నలిస్టులపై కక్ష కట్టారా జగన్! రఘురామ మరో లేఖాస్త్రం... 

Publish Date:Jun 28, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరో లేఖ రాశారు. ఈసారి జర్నలిస్టుల సమస్యలపై ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ.. వెంటనే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. జర్నలిస్టుల కష్టాలు, గత రెండేండ్లుగా పడుతున్న బాధలను తన లేఖలో వివరించారు ఎంపీ రఘురామ రాజు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎంపీ రఘురామ రాజు రాసిన లేఖ ఇది..

ముఖ్యమంత్రి గారూ, జర్నలిస్టులు…. మన మాటల్ని ప్రపంచానికి చెప్పే వీరి మాటల్ని మీకు చెప్పేందుకు నేను ఈ లేఖ రాస్తున్నాను.మీరు తీసుకున్న ఒక నిర్ణయం తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపు ఇచ్చే ఎక్రిడిటేషన్ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ మీడియా సంస్థల నుంచి జర్నలిస్టులు, జర్నలిస్టు యూనియన్ నాయకులు సభ్యులుగా ఉంటారు. అయితే మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎక్రిడిటేషన్ కమిటీలో ఒక్క జర్నలిస్టు కూడా లేడు. ఈ విషయంపై ఏ జర్నలిస్టు సంఘం కూడా మాట్లాడటం లేదు అంటే క్షేత్ర స్థాయిలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏ కారణమో తెలియదు కానీ ఒక్క సమావేశం కూడా జరుపుకోకుండానే ఆ కమిటీని రద్దు చేసేశారు కూడా. జర్నలిస్టు ఎక్రిడిటేషన్ కమిటీని రద్దు చేయడం కూడా పలు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ఆ తర్వాత మళ్లీ పైన చెప్పిన అందరు ప్రతినిధులు సభ్యులుగా మరొక కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 
ఆ తర్వాత మన ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. జర్నలిస్టులు ఎక్రిడిటేషన్ కార్డు పొందేందుకు (తన పనికి సంబంధించిన) ఆధారాలను సమర్పించాలని కోరింది. గతంలో జారీ చేసిన కార్డులను భద్రపరచుకోలేని జర్నలిస్టులు అందరూ కూడా ఈ నిబంధనతో కొత్త కార్డు పొందలేకపోయారు. 

జర్నలిస్టు సోదరులు చెబుతున్నది ఏమిటంటే జీవో నెం 142 జారీ చేయడం ద్వారా ఎక్రిడిటేషన్ కార్డుల జారీలో తమకు తీరని అన్యాయం చేశారని. ఎక్రిడిటేషన్ కమిటీ నుంచి జర్నలిస్టులను తొలగించడం ఈ జీవో జారీ పర్యవసానమే. జర్నలిస్టులకు ఎక్రిడిటేషన్ లు మంజూరు చేసేందుకు 2005లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 92 స్థానంలో మన ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 142ను సవాల్ చేస్తూ కొందరు జర్నలిస్టులు అందుకే హైకోర్టును ఆశ్రయించారు. 

గత రెండు సంవత్సరాలుగా మన ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయలేదు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి సుమారుగా 40,000 దరఖాస్తులు మన సమాచార శాఖ వద్ద పడి ఉన్నాయి. 60 సంవత్సరాల వయసు దాటిన కొందరు సీనియర్ జర్నలిస్టులకు మాత్రమే గౌరవ సూచకంగా ఫ్రీలాన్స్ జర్నలిస్టు క్యాటగిరి కింద ఎక్రిడిటేషన్లు జారీ చేశారు. ఇలా పెండింగ్ లో ఉన్న 40 వేల దరఖాస్తులలో 32 వేల దరఖాస్తులు సక్రమంగా ఉన్నట్లు సమాచార శాఖ అధికారులు చెబుతున్నారు కానీ వాటిలో 17 వేల దరఖాస్తులే ఇప్పటి వరకూ పరిశీలించారు. ఇప్పటి వరకూ 470 ఎక్రిడిటేషన్ కార్డులు మాత్రమే జారీ చేశారు. మరో 400 కార్డులు జారీ చేస్తారని అంటున్నారు. మరో ఆరు వేల మంది దరఖాస్తుదారుల సమాచారాన్ని మళ్లీ పంపమని కోరారు.

జర్నలిస్టులు ఎక్రిడిటేషన్ కార్డులు పొందడంలేదు సరికదా అసలు దరఖాస్తు చేసుకోవడానికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడానికి సమాచార శాఖ అత్యంత అసంబంద్ధమై నిబంధనలు పెట్టింది. చిన్న మధ్య తరగతి వార్తా పత్రికల వారు కూడా రెండు సంవత్సరాల జీఎస్ టి చెల్లింపుల లెక్కలు చెప్పాలనే కఠిన నిబంధన అందులో ఉన్నది. మీరు పాదయాత్ర చేసే సందర్భంలో జర్నలిస్టుల సమస్యలు అన్నీ పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే మీరు ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ వాణిని ప్రజలకు వినిపించే అతి ముఖ్యమైన ప్రభుత్వ ప్రచార సాధనం అయిన ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ప్రచురణనే నిలిపివేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వెల్లడించే ఆ మ్యాగజైన్ ముద్రణ నిలిపివేయడమే తొలి తప్పిదం.

గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు ఒక స్కీమ్ ఉండేది. జర్నలిస్టులు రూ.1200 చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక శాఖ నుంచి అంతే మొత్తం చెల్లించి ప్రభుత్వం జర్నలిస్టులకు పటిష్టమైన ఆరోగ్య భద్రత (హెల్త్ ఇన్ ష్యూరెన్స్) కల్పించేది. గత రెండు సంవత్సరాలుగా మీరు దీన్ని అమలు చేయడం లేదు. ఈ కరోనా మహమ్మారి కాలంలో వందలాది మంది జర్నలిస్టులు మరణించారు. ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి సాయం అందలేదు. ఎక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులు కరోనాతో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లిస్తామని మీరు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ ఎవరికి చెల్లింపులు చేయలేదు. ఎక్రిడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులు అందరూ ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులే. అయితే ఏ ఆసుపత్రి కూడా ఆరోగ్య శ్రీ పథకం కింద జర్నలిస్టులకు ఈ రోజు వరకూ సాయం చేయలేదు.

కరోనా మహమ్మారి సమయంలో క్షేత్ర స్థాయిలో పని చేస్తూ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న జర్నలిస్టులను కరోనా 19 వారియర్స్ తరహాలోనే, వారికి ఇస్తున్నట్లుగానే జర్నలిస్టులకు కూడా  రూ.50 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించాలి. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఇతర సంబంధిత సిబ్బంది తరహాలోనే జర్నలిస్టులను, మీడియా సిబ్బందిని తక్షణమే ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో చేర్చాలి. కోవిడ్ 19 పరిస్థితులలో కేరళ, ఒడిసా ప్రభుత్వాలు ప్రతి ఎక్రిడిటేటెడ్ జర్నలిస్టుకు రూ.10 వేలు ఎలవెన్సుగా చెల్లిస్తున్నాయి. రెవెన్యూ శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, పోలీసులు పని చేస్తున్న విధంగానే జర్నలిస్టులు కూడా ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. 

జరుగుతున్న ఈ పరిణామాలతో జర్నలిస్టులు మన ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అందువల్ల మీరు ఈ విషయంపై తక్షణమే ప్రత్యేక శ్రద్ధ చూపాలని నేను సూచిస్తున్నాను. ఎక్రిడిటేషన్ కార్డుల జారీపైనా, ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డు విషయంలోనూ సమస్యలు తీర్చి తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాను. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా తక్షణమే గుర్తించడం ద్వారా వారి సమస్యలను పరిష్కరించే వీలుకలుగుతుంది. మీ నుంచి సత్వర చర్యలను ఆశిస్తూ..

భవదీయుడు
కె.రఘురామకృష్ణంరాజు

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.