Publish Date:Aug 11, 2022
గత రెండు రోజులుగాదేశంలో రాఖీ హడావుడి జరుగుతోంది. ఉత్తరాదిలో ఇప్పటికే రంగు రంగుల బ్యాండ్లతో, చిన్నకవర్లో ఓ వంద నోటుతోనో చెల్లెళ్ల ఇంటికి పయనమవుతున్నారు. కానీ చిత్రంగా ఇది ఇటీవల మరీ రాజ కీయంగానూ మారిపోయింది. ఇంట్లో చూపించేది నిజంగానే అన్నాచెల్లెళ్ల ప్రేమ బయటికి వస్తే సదరు చెల్లలో, అక్కో ఖచ్చితంగా ఓటరుగానే చెల్లుబాటు అవుతోన్నారు.
అన్నా..నీ అనురాగం ఏన్నో జన్మల పుణ్యఫలం.. అంటూ ఓ పాత సినిమాలు ఓచెల్లి ఇల్లంతా తిరుగుతూ హీరోగారికి చెల్లి ప్రేమ పంచుతుంది. అప్పట్లో ఈపాటకు అమాంతం వెనకవరసల్లో ఉన్నవారు కన్నీళ్ల పర్యంతమయ్యారు. పరుగున చెల్లెళ్ల ఇంటికి పరుగులు పెట్టారు. ఇదంతా ఒక ఎత్తు, సర్వసాధారణం. కాగా, ఎన్నికల సమయంలో దాదాపు అన్ని పార్టీలవారు అక్కచెల్లెళ్లను కలవాలని భార్యా సమేతంగా ఏకం గా కుం కుమ భరిణితో అన్నిఅపార్ట్‌మెంట్లకీ తిరగడం ఆనవాయితీగానూ మారిపోయింది. రాజకీయ నాయ కుల ప్రేమలో కొంత స్వార్ధం ఉంటుంది. వారు ఎంత ప్రచారం చేసుకున్నా సదరు అక్కచెల్లెళ్లు చివరాఖ రికి ఓటర్లుగా మారిపోతారు. ప్రధాని మోదీజీ కూడా ఈ చెల్లెళ్ల ప్రేమను ఉప్పొంగించాలని చాలా ఆతృతే ప్రదర్శించారు.
ఇటీవల కోవిడ్ మహమ్మారి సమయంలో నిజానికి ఎంతో అద్భుతంగా డాక్టర్లతో సమానంగా పనిచేసింది పారిశుద్ధ్య కార్మికులే. ఇందులో సందేహం లేదు. వారికి దేశప్రజలంతా అపార గౌరవాన్ని ప్రదర్శించారు. కాగా ఇపుడు లేటెస్టుగా ప్రధాని రక్షాబంధన్ అడ్డంపెట్టుకుని మంగళవారం (ఆగష్టు 10) ఢిల్లీలో ప్రధాని తన కార్యాలయంలో పనిచేస్తున్నపారిశుధ్య కార్మికుల పిల్లల్ని పిలిపించి వారితో రాఖీ కట్టించుకున్నారు. ఆ వచ్చిన పిల్లలు తల్లులతో పాటు ఎంతో మురిసిపోయారు. కానీ విపక్షాలు మాత్రం ఇదంగా రాజకీయ జిమ్మిక్కుగానే వర్ణిస్తున్నారు. నరేంద్రమోదీ వంటి రాజకీయ చతురుడు, ఎత్తులు, పై ఎత్తులు వేయడంలో ఆరితేరినవారూ బీజేపీలో ఎవ్వరూ లేరు. ఆయనకు ఏ సమయంలో ఎవరిని ఆకట్టుకోవాలన్నది బాగా ఎరుకే.
రక్షాబంధన్ మాత్రమే కాదు అజాదీ కా అమృతోత్సవ్ పాఠాన్ని దేశ ప్రజలందరికీ వినిపించి దేశ భక్తిని ప్రతీవారు ప్రదర్శించాలని. అందుకు గుర్తుగా జాతీయ పతాకాన్ని ఇంటి మీద, కార్యాలయాల మీద ఎగుర వేయాలని ఆదేశించడం ఆయన ప్రత్యే కత. మరి తాజాగా పారిశుధ్య కార్మికుల పిల్లలచేత రాఖీ కట్టిం చుకోవడం కూడా దేశభక్తి అక్కాచెల్లెళ్ల ప్రేమను వ్యక్తం చేయమనడం కంటే ఇంత బ్రహ్మాండంగా పాలి స్తున్న బీజేపీ ని మళ్లీ గెలిపించి పుణ్యం కట్టుకోవాలనే సందేశం దేశంలో ప్రచారానికి ఇదో గొప్ప అస్త్రం. ఎందుకంటే భావీభరాత పౌరులు అండ దండలు మరి ఎవరికైనా అవసరేమగా!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mothers-what-about-vote-39-141742.html
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.