ఇన్‌స్టాగ్రామ్‌లో తోపులెవరో తెలుసా?

Publish Date:Jun 16, 2026

Advertisement

అంతర్జాతీయ దౌత్య వేదికలపై దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలు, ఒప్పందాలు జరగడం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు అక్కడ చోటుచేసుకునే సరదా సన్నివేశాలు ప్రపంచవ్యాప్తంగా  నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. సరిగ్గా ఇలాంటి ఒక  సరదా సన్నివేశం ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న జీ7 సదస్సులో ఆవిష్కృతమైంది. 

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సంభాషణ మళ్లీ మెలోడీ ట్రెండ్ ను తెరపైకి తెచ్చింది. 

ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లో మనమే   ఫేమస్ అంటూ ఇటలీ పీఎం మెలోనీ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. జీ 7 సదస్సులో భాగంగా ప్రపంచ దేశాల అధినేతలంతా సంప్రదాయబద్ధంగా ఒకేచోట చేరి  ఫ్యామిలీ ఫోటో' దిగడానికి సిద్ధమైన సమయంలో   ప్రధాని నరేంద్ర మోదీని పలకరించిన జార్జియా మెలోనీ.. మిమ్మల్ని ఇక్కడ మళ్లీ కలుసుకోవడం సంతోషందా ఉందన్నారు.  దానికి ప్రధాని మోదీ డిజిటల్ ప్రపంచంలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో తమ ఇద్దరికీ ఉన్న   పాప్యులారిటీని గుర్తు చేశారు. మోదీ సమాధానానికి ఇటలీ ప్రధాని మెలోనీ హాయిగా నవ్వుతూ..  నిజమే.. ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే  ఫేమస్ మన తరువాతే ఎవరైనా అంటూ బదులిచ్చారు.

అలా ఈ ఇద్దరి మధ్యా జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  నిముషాల వ్యవధిలోనే   లక్షలాది వ్యూస్‌ వచ్చాయి. నిజానికి ప్రధాని మోదీ, జార్జియా మెలోనీల మధ్య ఇలాంటి సరదా ముచ్చట్లు సాగడం ఇదే మొదటిసారి   కాదు. గతంలో ఇటలీ రాజధాని రోమ్‌ నగరంలో జరిగిన ఒక ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ ఇటలీ పీఎం మెలోనీకి మెలోడీ చాక్లెట్ల ప్యాకెట్‌ను  బహుమతిగా ఇచ్చారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అప్పట్లో మెలోనీ,  హలో ఫ్రం ది మెలోడి టీమ్ అనే క్యాప్షన్‌ను జోడించి మోడీ తనకు మెలోడీ చాక్లెట్లను బహుమతిగా అందజేస్తున్న ఫొటోను పోస్టు చేశారు.  అప్పటి నుంచి నెటిజన్లు నరేంద్ర మోదీ పేరులోని చివరి అక్షరాలను, జార్జియా మెలోనీ పేరును కలిపి  మెలోడి  హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ చేశారు.  

By
en-us Political News

  
బాపూ సరోవర్ నిర్మాణానికి అవసరమైన అత్యంత కీలకమైన రక్షణశాఖ భూముల బదలాయింపునకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ అధికారికంగా అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం (జూన్ 19) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుమారు 550 కోట్ల రూపాయల భారీ వ్యయంతో చేపట్టతలపెట్టిన ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యం...కొత్త వ్యూహాలతో జనసేన ముందడుగు!
సాయికృష్ణ కేసులో దోషులపై కఠిన చర్యలు..
లింగంగుంట్ల నుంచి నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు..
హైదరాబాద్ శివార్లలోని గండిపేట పరిధిలో వెలుగుచూసిన సంచలనాత్మక నకిలీ జీఓల భూ కబ్జా కేసు
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది
గుజరాత్‌లో డెయిరీ క్వీన్ గా ఎదిగిన మహిళా ప్రస్థానం..
మసూరీ టూర్‌లో వైజాగ్ మహిళా టెక్కీ అనుమానాస్పద మృతి.. భర్తపైనే తల్లిదండ్రుల అనుమానాలు!
పాఠశాల వార్షికోత్సవంలో పాక్ దేశభక్తి గీతం..
హైదరాబాద్ నగరంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక నీట్ (NEET) పరీక్ష వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే
చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లతో ధర్మశాల, న్యూజిలాండ్ మైదానాలను తలపిస్తున్న కడప క్రికెట్ స్టేడియం అందాలు
లీప్‌ఫ్రాగ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఐపీఓ (Leapfrog Engineering SME IPO) నేటితో ముగియనుంది. తాజా సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP), లాట్ సైజ్ మరియు కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.