Publish Date:Sep 20, 2024
నిఫా, మంకీ పాక్స్ వైరస్ లు వణికిస్తున్నాయి. దేశంలో ఈ రెండు వైరస్ లు బయటపడ్డాయి. కేరళకు చెందిన ఒక వ్యక్తికి రెండు వైరస్ లూ సోకాయి. మంకీపాక్స్ తో కేరళ ఇప్పటికే వణికిపోతున్నది. ఇప్పుడు తాజాగా నిఫా వైరస్ కూడా రాష్ట్రంలో వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఒకే వ్యక్తికి ఈ రెండు వైరస్ లూ సోకడంతో కేరళ సర్కార్ అలర్ట్ అయ్యింది. మంకీ పాక్స్.. నిఫా వైరస్ వ్యాప్తితో కేరళలలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడును కూడా అధికారులు అలర్ట్ చేశారు.
ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ సోకినట్లు కేరళ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఆయన మంకీపాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిపింది. మంజేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని శాంపిల్స్‌ను కోజికోడ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. పాజిటివ్‌గా తేలింది. దాంతో.. దేశంలో రెండో మంకీపాక్స్ కేసు రికార్డ్ అయింది. అలెర్ట్ అయిన కేరళ అధికారులు.. దుబాయ్ నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఎవరెవర్ని కలిశారో వారిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. 16మందిని గుర్తించి ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. ఈనెల 9న తొలి మంకీపాక్స్ కేసు నమోదు అయింది.
ఒకవైపు కేరళను మంకీపాక్స్ వణికిస్తుండగా.. ఇప్పుడు నిఫా వైరస్ మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా.. ఒక వ్యక్తికి నిఫా వైరస్ నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. అతనితో కలిసి ఉన్న 268 మందిని ఐసొలేషన్‌లో ఉంచారు కేరళ అధికారులు. వారిలో 81 మంది హెల్త్ కేర్ వర్కర్స్, 177మంది ప్రైమరీ కాంటాక్ట్ ప్రజలు, 90మంది సెకండరీ కాంటాక్ట్ ప్రజలుగా గుర్తించారు. వీరిలో కొందరిని హైరిస్క్ కేటగిరిలో ఉంచారు.
ఇదిలావుంటే.. కేరళలోని మలప్పురంలో నిఫా వైరస్‌తోపాటు.. మంకీ పాక్స్ లక్షణాలున్న వ్యక్తులను గుర్తించారు. దీంతో తమిళనాడు- కేరళ సరిహద్దు జిల్లాల్లో అలెర్ట్ ప్రకటించారు. కేరళ నుంచి కన్యాకుమారి ద్వారా తమిళనాడుకు వస్తున్న వాహనాలపై నిఘా పెంచారు. పూర్తి వైద్య పరీక్షల తర్వాతే కేరళ నుంచి తమిళనాడులోనికి ప్రజల్ని అనుమతిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/monkeypox-and-nifa-viruses-in-one-man-39-185177.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.