మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి అద్భుతమైన చిట్కాలు..!
Publish Date:Jun 15, 2025
.webp)
Advertisement
సమాజంలో చాలా వరకు మధ్యతరగతి,దిగు తరగతి కుటుంబాలే ఉంటాయి. అటు పేదవాళ్లలా తమకు ఏమీ లేదని సమాధానం చెప్పుకోలేరు. ఇటు ధనికులతో పోల్చుకుని తమ సంతోషాలు ఎందుకు వదులుకోవాలి అని సంఘర్షణ ను దాటలేరు. రెండింటికి మధ్య రేవడిలా మధ్యతరగతి కుటంబాలు ధనికులకు, పేదవారికి మధ్య సతమతం అయిపోతుంటారు. అయితే చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఎదగకపోవడం అనేది వారు తీసుకునే నిర్ణయాల పైనే ఆధారపడి ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ కింది చిట్కాలు పాటిస్తే మధ్యతరగతి వారు కూడా ధనికులుగా మారిపోవచ్చు. దానికోసం పాటించాల్సిన చిట్కాలు తెలుసుకుంటే..
బడ్జెట్..
నెలకి ఎంత ఆదాయం వస్తుందో, ఎంత ఖర్చవుతుందో స్పష్టంగా తెలుసుకోవాలి. అవసరమైన ఖర్చులు (ఆహారం, ఇంటి అద్దె, విద్య, వైద్యం) & అనవసరమైన ఖర్చులు (బయట తినడం, వృధా షాపింగ్) వేరు చేయాలి. ప్రతి నెలా ఖర్చుల లెక్క రాసే అలవాటు పెట్టుకోవాలి. ఇలా చేస్తే బడ్జెట్ ప్లానింగ్ సమర్థవంతంగా అమలు చేయవచ్చు.
పొదుపు..
ప్రతి నెలా కనీసం 10%–20% ఆదాయాన్ని పొదుపుగా మార్చాలి. RD,SIP లాంటి సురక్షిత, స్థిరమైన పొదుపు పద్ధతులు ఎంచుకోవడం ఉత్తమం. వీటిని చిన్న మొత్తాలతో మొదలుపెట్టాలి. ఆ తరువాత దాన్ని పెంచుకుంటూ వెళ్లాలి.
పెట్టుబడులు..
SIP, మ్యూచువల్ ఫండ్స్, PPF, FD, RD, Gold Bonds వంటి పెట్టుబడి మార్గాల గురించి తెలుసుకుని వాటిని అనుసరించడం మంచిది. వడ్డీని సంపాదించేవాడు కంటే వడ్డీని చెల్లించేవాడు ఎప్పుడూ నష్టంలో ఉంటాడు. కాబట్టి ఆస్తులపై పెట్టుబడి పెట్టడం మంచిది.
ఆర్థిక విద్య..
“ఇన్వెస్ట్ మెంట్ అంటే ఏమిటి? బీమా ఎందుకు అవసరం? రిస్క్ మేనేజ్‌మెంట్ ఎలా?” వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే పొదుపు చేయడం ఆర్థికంగా ఎదగడం సులువు అవుతుంది. వీటి కోసం ఎక్కడో డబ్బు కట్టి క్లాసులు అటెండ్ కావాల్సిన అవసరం లేదు. YouTube, ఫ్రీ ఆన్లైన్ కోర్సులు, ఆర్థిక బ్లాగులు చదవితే సరిపోతుంది.
అప్పులు..
అవసరం లేని క్రెడిట్ కార్డ్స్, వ్యక్తిగత అప్పులు తీసుకోవద్దు. అప్పులు తీసుకుంటే వాటిని తక్కువ వడ్డీతో త్వరగా తీర్చేయాలి. ఇలా లేకపోతే దీర్ఘకాలం నష్టం ఎదురవుతుంది.
అదనపు ఆదాయ మార్గాలు..
వర్క్ ఫ్రం హోం అవకాశాలు, ఫ్రీలాన్స్ పనులు, వంటకాలు/హస్తకళల ద్వారా ఉపాధి మొదలైనవి అదనపు ఆదాయానికి మంచి మార్గాలు. కుటుంబ సభ్యులు కొంతమంది పని చేసే స్థితిలో ఉంటే, వారికి ఆధునిక నైపుణ్యాలు నేర్పించడం మంచిది. (Digital Marketing, Data Entry, Content Writing, Handicrafts మొదలైనవి).
ఆర్థిక విషయాలు..
భార్యాభర్తలు కలిసి ఆర్థిక ప్రణాళిక ప్లాన్ చేయాలి. పిల్లలకు చిన్న వయసులోనే పొదుపు, ఖర్చుల విలువ నేర్పాలి. ఇది భవిష్యత్తులో పిల్లల ద్వారా ఆర్థిక దుర్వినియోగం జరిగే అవకాశాలు తగ్గించి పొదుపును ప్రోత్సహిస్తుంది.
బీమా..
ఆరోగ్య బీమా (Health Insurance), జీవన బీమా (Life Insurance) తీసుకోవడం వలన అనుకోని పరిస్థితుల్లో పెద్ద వ్యయం దూరం అవుతుంది.
దీర్ఘకాలిక లక్ష్యాలు..
పిల్లల చదువు, ఇంటి కొనుగోలు, రిటైర్మెంట్ వంటి విషయాలకు ముందుగానే ప్రణాళిక వేయాలి. ఇలా ప్రతి ఒక్కటి ఆలోచనతో, చిన్నగా మొదలుపెడితే మధ్యతరగతి కుటుంబాలు కూడా ధనిక కుటుంబాలుగా ఎదుగుతాయి. ముఖ్యంగా ఒక మనిషి సంపాదన మీద కుటుంబం గడిస్తే అది మధ్యతరగతి కుటుంబాలను ఎదగనీయదు. కాబట్టి కుటుంబంలో ఎవరి సామర్థ్యం, ఎవరి ప్రతిభకు తగ్గట్టు వారు ఏదో ఒక వర్క్ చేసి సంపాదిస్తూ ఉంటే కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/money-saving-tips-for-middle-class-families-35-200029.html












