నెహ్రూను దాటేసిన మోడీ
Publish Date:Jun 10, 2026
Advertisement
దేశంలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా పదవిలో కొనసాగిన రికార్డు ఇప్పడు నరేంద్రమోడీ పేరు మీద ఉంది. ఇప్పటి వరకూ భారత తొలి ప్రధాని జవహర్లాల్ పేరు మీద ఉన్న ఈ రికార్డును ప్రధాని మోడీ తిరగరాశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, కేంద్రంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరవధికంగా దేశానికి సేవలు అందించిన ఏకైక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న ఈ రికార్డును మోదీ బద్దలు కొట్టారు. ఈ చారిత్రక ప్రస్థానంలో సరిగ్గా బుధవారం (జూన్ 10) నాటికి నరేంద్ర మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. బుధవారం (జూన్ 10) తో ప్రదాని మోడీ నెహ్రూను అధిగమించారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 14 ఏళ్లకు పైగా ప్రధానిగా సేవలు అందించినప్పటికీ.. ఆమె నిరంతరాయంగా ఆ పదవిలో కొనసాగలేదు. కానీ మోదీ మాత్రం 2014, 2019,2024 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు చారిత్రాత్మక విజయాలను అందుకొని, నిరవధికంగా ప్రధానిగా కొనసాగుతూ అప్రతిహతంగా దూసుకుపోతున్నారు. ఈ అద్భుతమైన ఘనతను.. అలాగే కేంద్రంలో ఎన్డీఏ (NDA) ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపం లో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఆయనతో పాటు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు కూడా హాజరయ్యారు. అలాగే.. దేశవ్యాప్తంగా ఉన్న 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మిత్రపక్షాల అధినేతలు ఈ వేడుకకు తరలివచ్చారు. ఈ చారిత్రక మైలురాయిని అందుకున్న ప్రధాని మోదీకి ఘనంగా అభినందనలు తెలుపుతూ ఎన్డీఏ కూటమి ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సమావేశంలో గత 12 ఏళ్ల ప్రభుత్వ విజయాలు, భవిష్యత్తు కార్యాచరణ మరియు రాబోయే రాజకీయ వ్యూహాలపై చర్చించారు.
http://www.teluguone.com/news/content/modi-surpasses-nehru-25-222415.html





