ఎలక్ట్రానిక్ రికార్డుల తనిఖీపై నిషేధం.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం!

Publish Date:Dec 24, 2024

Advertisement

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వమ్య దేశం ఇండియా. అయితే ప్రస్తుతం ఇండియాలో ప్రజాస్వామ్యం అన్నదానికి అర్ధం మారిపోతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వరుసగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టింది. అయితే తొలి రెండు సార్లూ కూటమి భాగస్వామ్య పార్టీల మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని నడిపే బలం బీజేపీకి కట్టబెట్టిన ప్రజలు.. మూడో సారి మాత్రం ఆ బలాన్ని ఇవ్వలేదు. మిత్రపక్షాల మద్దతు ఉంటేనే ప్రభుత్వం మనుగడ సాగించే పరిస్థితి కల్పించి.. వ్యవస్థలపై పెత్తనం చెలాయిస్తున్న ప్రధాని మోడీ సర్కార్ కు చెక్ పెట్టారు. వ్యక్తిగత అజెండా, సంఘ్ పరివార్ రహస్య అజెండా అమలుకు అసలే మాత్రం అవకాశం లేకుండా ముందరి కాళ్లకు బంధం వేశారు.

అయితే ప్రతిపక్ష  కూటమి అనైక్యత కారణంగా ఆ బంధనాలు మోడీ సర్కార్ ను ఇసుమంతైనా ఇరుకున పెట్టలేకపోతున్నాయి. జమిలి ఎన్నికల నుంచి, ఎన్నికల సంస్కరణల వరకూ అన్నీ తన ఇష్టారాజ్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ క్రమంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం వాటిల్లేలా చేస్తున్నది. తాజాగా మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యం ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు మోడీ నిర్ణయం ఆ విమర్శలకు బలం చేకూర్చేదిగానే ఉంది. 

ఎన్నికలకు సంబంధించి సిసి టీవి ఫుటేజి, వెబ్‌ కాస్టింగ్‌, అభ్యర్ధుల వీడియోలు వంటి ఎలక్ట్రానిక్‌ రికార్డుల తనిఖీని కేంద్రం నిషేధించింది. దీంతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకతకు తావే లేకుండా చేసిందని పరిశీలకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం  ప్రజాస్వామ్యానికి, ఎన్నికల ఆధారిత పార్లమెంటరీ వ్యవస్థకు తీవ్ర విఘాతం అనడంలో ఇసుమంతైనా సందేహాంచాల్సిన అవసరం లేదు. 1961-ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్‌ 93(2)(ఎ) ప్రకారం ఎవరైనా ఎన్ని కలకు సంబంధించిన అన్ని రికార్డులనూ తనిఖీ చేయడానికి అనుమతి ఉంది. ఇక నుంచి ఎలక్ట్రానిక్‌ రికార్డుల పరిశీలన కుదరదని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఎన్నికల రూల్స్‌ను ఏకపక్షంగా మార్చేసింది. ఒక కేసు కారణంగా ఎన్నికల సంఘం (ఇసి) సిఫారసు మేరకు రూల్స్‌ సవరించామన్న ప్రభుత్వ వివరణ ఈ దుర్మార్గ నిర్ణయం విషయంలో తన చేతికి మట్టి అంటుకోలేదని సంబరపడటానికి తప్ప మరెందుకూ పనికి రాదు.  

 ఇటీవలి హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హర్యానా-పంజాబ్‌ హైకోర్టులో వేసిన కేసులో పిటిషన్‌దారు అభ్యర్ధన మేరకు రికార్డులన్నింటినీ షేర్‌ చేయాలని న్యాయస్థానం ఇసి ని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణ రూల్స్‌ ప్రకారం ఇవ్వాలని నిర్దేశించింది. కోర్టు తీర్పును అమలు చేయాల్సిన ఇసి, అందుకు భిన్నంగా రూల్స్‌ మార్చాలని కేంద్రాన్ని కోరింది. అలా కోరడం తరువాయి.. కేంద్రంలోని మోడీ సర్కార్ ఆఘమేఘాల మీద నిబంధనలను మార్చేసి న్యాయస్థానం అదేశాలను తుంగలోకి తొక్కేసింది.    

రిగ్గింగ్‌, అవకతవకలు సహా ఎన్నికల్లో అక్రమాలను, నిరోధించేందుకు, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం సిసి టీవీలను, వెబ్‌ కాస్టింగ్‌ను కొన్నేళ్ల కిందట  ఈసీ  ప్రవేశపెట్టింది. పోలింగ్‌కు ఆటంకాలు ఏర్పడిన సందర్భాలలో  అభ్యర్ధుల, రాజకీయ పార్టీల ఫిర్యాదుల మేరకు ఈసీ వీడియోలను పరిశీలించి రీపోలింగ్‌కు ఆదేశించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియలో ఏ చిన్న మార్పు చేయాల్సి వచ్చినా రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం విస్తృత సంప్రదింపులు జరపడం ఆనవాయితీ.  కానీ ప్రస్తుత రూల్స్‌ మార్పుపై ఆ విధంగా చర్చ జరగలేదు. ఈసీ కోరింది. కేంద్రం చేసేసింది. అంతే. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం ప్రతిపక్షాలను, రాజకీయ పార్టీలనూ విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది.   రికార్డుల తనిఖీ వలన ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతుందని, వీడియోలను ఉపయోగించుకొని కృత్రిమ మేధ సహాయంతో పైరసీ వీడియోలు తయారు చేస్తున్నారన్న కేంద్ర ప్రభుత్వ, ఇసి వాదనలో పస లేదు. ఎన్నికల రికార్డులు బయట పడితే  తమకు ఇబ్బంది అన్న భయంతోనే  మోడీ సర్కార్‌ ఎలక్ట్రానిక్‌ రికార్డుల తనిఖీపై నిషేధం విధించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మోడీ సర్కార్‌ ప్రభావంలో ఇసి పని చేస్తోందనడానికి గడచిన పదేళ్లల్లో ఎన్నో దృష్టాంతాలున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకపు ప్యానెల్‌లో సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ను తొలగించడంతోనే ఈ విషయం నిర్ద్వంద్వంగా రుజువైంది. ఇప్పుడు ఏకంగా హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా రూల్స్‌నే మార్చేయడం తిరుగులేని రుజువుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  స్వతంత్రంగా పని చేయాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థ ఇసిపై ఇంతటి స్థాయిలో సందేహాలు రావడం ఏ విధంగా చూసినా  ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎన్నికల సంఘంపై  ప్రజలు విశ్వాసం కోల్పోతే రాజ్యాంగానికే ప్రమా దం. రాజకీయ పార్టీల, అభ్యర్ధుల హక్కులను ప్రస్తుత నిబంధనల మార్పు చిదిమేస్తుందనడంలో సందే హం లేదు. కాగా నిబంధనలను మార్చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అది వేరు సంగతి. అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా ఎన్నికల నిబంధనలను మార్చేసి ఎలక్ట్రీనిక్  రికార్డుల తనిఖీపై విధించిన నిషేధాన్ని మోడీ సర్కార్ బేషరతుగా తక్షణమే ఉపసంహరించుకోవాలి.  

By
en-us Political News

  
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.