Publish Date:Mar 23, 2026
ప్రధాని నరేంద్రమోడీ ఖాతాలో అత్యంత అరుదైన రికార్డ్ చేరింది. భారత రాజకీయ చరిత్రలోనే గతంలో ఎవరికీ సాధ్యం కాని ఈ రికార్డును మోడీ సొంతం చేసుకున్నారు. అయన పీఎంగా అత్యున్నత స్థానంలో అత్యధిక రోజులు కొనసాగిన వ్యక్తిగా రికార్డు సాధించారు. ఇక నుంచి ఆయన అధికారంలో ఉన్న ప్రతి రోజూ ఒక కొత్త రికార్డు నమోదు అవుతూనే ఉంటుంది. అదెలా ఉంటే నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
వివరాల్లోకి వెడితే.. 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా తొలిసారి గా బాధ్యతలు చేపట్టిన ఆయన సుమారు 13 ఏళ్ల పాటు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. అనంతరం.. 2014, మే 26న భారత ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి నేటి వరకూ ఆయన భారత ప్రధానిగా సేవలందిస్తున్నారు. అంటే గుజరాత్ సీఎంగా నాలుగు సార్లు, ప్రధనిగా మూడు సార్లు వరుస ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా మోడీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ప్రభుత్వాధినేతగా కొనసాగిస్తున్నారు.
ఇప్పటి వరకూ మోడీ 2002, 2007, 2012 ఎన్నికలను ముఖ్యమంత్రిగా విజయం సాధించడం మాత్రమే కాదు.. 2014, 19, 24 ఎన్నికలను ప్రధానిగా విజయం సాధించడం కూడా ఒక రికార్డే. ప్రధానిగా వరుసగా మూడు ఎన్నికల విజయం సాధించడం ద్వారా భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును బద్ధలు కొట్టారు. అత్యధిక కాలం పీఎంగా ఉండి మజీ ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును కూడా ఆయన బ్రేక్ చేశారు. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న రెండో పీఎం మోడీయే. అంతే కాదు ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం అనుభవం ఉన్న ప్రధాని కూడా మోడీయే. కాగా మోడీ రికార్డులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించి ప్రధానికి అభినందనలు తెలిపారు. మోడీ ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతకు, పాలనాదక్షతకు ఇది నిదర్శనమని ప్రస్తుతించారు. 24 ఏళ్లకు పైగా ఎక్కడా విరామం లేకుండా దేశానికి సేవ చేయడం ఒక అరుదైన ఘనతగా కీర్తించారు.
2029 లో కూడా మోడీయే ప్రధాని అయితే ఇది మరో ఘనత కూడా అవుతుంది. నాలుగు సార్లు ముఖ్యమంత్రి నాలుగు సార్లు ప్రధాని అయిన ఈ రికార్డును వచ్చే రోజుల్లో మరే నేత కూడా బ్రేక్ చేసే ఛాన్సే లేదని అంచనా వేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/modi-create-record-39-215988.html
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.