బీఆర్ఎస్ నేతలతో జీవన్ రెడ్డి రంజాన్ ప్రార్థనలు..కాంగ్రెస్ బుజ్జగింపులు షురూ

Publish Date:Mar 21, 2026

Advertisement

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు,  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసినట్లే.  గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి నేడు రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. దీంతో ఆయన తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు.

 జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే తన నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించి, కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.  తాజాగా బీఆర్ఎస్ నేతలతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొనడం ద్వారా తను కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నట్లు చాటారని భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 

పార్టీ మారతానని ప్రకటించిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు.  మంత్రులు అడ్డూరి లక్ష్మణ్, శ్రీధర్ బాబులు జగిత్యాల వెళ్లి మరీ ఆయనతో భేటీ అయ్యారు.  పార్టీ మారే ఆలోచన వీడాలని సూచించారు. సమస్య ఏదైనా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తామనీ వారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు సమచారం.

అయితే ఈ రాయబారంపై జీవన్ రెడ్డి ఎలా స్పందించారన్నది తెలియరాలేదు.  ఇంతకు ముందే జీవన్ రెడ్డితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్లో నటరాజ్ భేటీ అయ్యారనీ, పార్టీలో ప్రాధాన్యత ఇస్తామనీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి మరి జీవన్ రెడ్డి పార్టీ మార్పు విషయంలో తన వైఖరిని మార్చుకుంటారా.. లేక గుడ్ బై చెప్పాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉంటారా?  

By
en-us Political News

  
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.