తిట్టించుకోండి.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ తిరగండి!

Publish Date:Jul 18, 2022

Advertisement

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వెళ్లి మా పాల‌న గురించి వాక‌బు చేయండి అని పూర్వం రాజులు వేగుల‌ను పంపేవారు. అప్ప‌ట్లో ప్ర‌జ‌ల శ్రేయ‌స్సే వారి పాల‌న‌కు గీటురాయి. వాళ్లు ఏమ‌న్నా వేగులు అదే మాట‌ను రాజుగారి చెవిలో వేసేవారు. రాజుగారు పొర‌పాట్ల‌ను స‌రిదిద్దుకునేవారు. ఆ కాలం పోయింది. రాజుల్లా పాలిస్తున్నా మ‌నుకునే ఆధునిక పాల‌కుల‌కు ఆదేశాలివ్వ‌డం త‌ప్ప విన‌డం ఉండ‌దు, లేదు.

ప్ర‌జ‌ల‌కు త‌మ ప‌నులు తెలియ‌జేయ‌డం, మొట్టికాయ‌లు వేయ‌డం తప్ప వాళ్ల గోడు, నినాదాలు ప‌ట్ట‌వు. మంత్రుల‌ను పుర‌మా యిస్తున్న ప్ర‌భువుకు ప్ర‌జ‌ల తిట్ల దండ‌క‌మే మోహ‌న‌రాగం! త‌ప్ప‌డం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీరు ఇలా వుంది. గ‌డ‌ప గ‌డ‌ప‌కు వెళ్లి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ఫ‌లితాల‌ను ప్ర‌చారం చేయ‌మ‌ని మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను సీఎం పంపుతున్నారు. కానీ వెళ్లిన‌వారికి దాదాపు అంద‌రికీ అవ‌మానాలు, తిట్లు త‌ప్ప టిఫిన్ పెట్టి అంతా బాగుండావ‌న్నా .. అన్న వారు ఒక్క‌రు లేరు. అయిన‌న్ పోవ‌లే అని జ‌గ‌న్ మ‌ళ్లీ త‌రుముతున్నారు. స‌మీక్షా స‌మావేశం పేరుతో అంద‌ర్నీ పిలిచి ఆ తిట్లేవో వాళ్ల‌ నోటినే వినాల‌ని జ‌గ‌న్‌కి ఎంత సంబ‌ర‌మో! ల‌క్ష‌లు త‌గ‌లేసి ఓట్లేయించుకుని గెలిచిన ఎమ్మెల్యేలు రాజుల్లాగా నియోజ‌క‌వ‌ర్గాల్లో తిర‌గాలి. కానీ ఇలా భ‌యం భ‌యంగా వెళ్లి జ‌గ‌న్ భ‌జన‌లు చేయ‌గానే వింటున్న న‌లుగురైదుగురూ విసుక్కుంటున్నారు. నొస‌ల‌తో వెక్కిరిస్తున్నారు.. కొన్ని ప్రాంతాల్లో నోరూ చేసుకుంటున్నారు.

ఇంత‌ కంటే కేవ‌లం పాంప్లెట్లు పంచి ఇంటికి వ‌చ్చేస్తే స‌రిపోద్దిగా అన్నా అనుకుంటున్నారు వెళ్లిన‌వారు. అలాంటి ప‌రిస్థితిని ప్ర‌భుత్వ మే కోరి తెచ్చుకుంది. పాల‌న‌ కాలం మూడేళ్లు అయిపోయినా ఇంత‌వ‌ర‌కూ చాలా బావుంది జ‌గ‌న‌న్నా.. అన్న‌వారు పులివెందుల్లో కూడా లేక‌పోవ‌డం విడ్డూర‌మే. కానీ వాస్త‌వం. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి విప‌క్షాల‌ను తిట్టిపోయ‌డం, వెక్కిరించ‌డం త‌ప్ప ప్ర‌త్యేకించి చేసిదేమీ లేదన్న‌ది ప్ర‌జ‌లు గ‌మనించారు.  కేవ‌లం ప‌థ‌కాలు ప్ర‌చారం చేసుకోవ‌డం త‌ప్ప నిజంగా వాటి ఫ‌లాలు అందరికీ అందుతున్నాయా అంటే అనుమానమే. అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవారే  అందరూ.  

పోనీ రాజ‌కీయంగా చూసుకున్నా, ప్ర‌త్యేక రాష్ట్ర హోదా, ప్రాజెక్టులూ పూర్తి చేస్తాననీ, కేంద్రం నుంచి రావాల్సిన వాటిని సాధిస్తా న‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికి ఓట్లేయించుకున్న జ‌గ‌న్ ఆ త‌ర్వాత చ‌ప్ప‌బ‌డ్డారు. కేంద్రంలో బిజెపి నాయ‌కుల‌తో సంప్ర‌దించి తాడో పేడో తేల్చుకుంటాన‌ని వెళ్లిన ప్ర‌తిసారీ చ‌క్క‌గా ఫోటోలు తీయించుకోవ‌డానికే ప‌రిమిత మ‌య్యార‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మైపోయింది.  కార‌ణం ఆయ‌న ఒక్క మాటా వారి భేటీల గురించి పెద‌వి విప్ప‌క‌పోవ‌డ‌మే.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ అధికారంలోకి రావాలంటే ప్ర‌జ‌ల‌ను నేరుగా వారి ఇంటి వ‌ద్ద‌నే క‌లిసి బాగోగులు తెలుసుకోవాల‌న్న ఆలోచ‌న అమ‌లు చేశారు. కానీ ప‌థ‌కం ఆలోచ‌నా పేరు బాగానే వుంది.. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ అంటూ. కానీ వెళ్లిన ప్ర‌జాప్ర‌తినిదులు ఎవరూ స‌ర‌యిన ఆద‌ర‌ణ‌కూ నోచుకోవ‌డం లేదు. వీరి మాట‌లు విన‌డానికి  ఏ ప్రాంతంవారూ బొత్తిగా సిద్ధంగా లేక‌పోవ‌డ‌మే విడ్డూరం. ఇక వెళ్ల‌డం దేనికి?   కానీ ఎమ్మెల్యే లు, మంత్రుల ప‌రిస్థితి తెలిసినా తెలియ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించి  తిరిగి వ‌చ్చిన వారి గ్రాఫ్ ను ప‌రిశీలించచ‌డం హాస్యాస్ప‌దంగా మారింది.  మ‌ళ్లీ అలా వెళ్లిరండి అంటూ త‌ర‌మ‌డానికే స‌మావేశాలు పెట్టి జ‌గ‌న్ వారిని ఒత్తిడి చేయడం చూస్తున్నాం.

కాగా అలా వెళ్లిన‌వారు ఎంత‌గా అవ‌మానాలు ఎదుర్కొంటున్నార‌న‌డానికి తాజా ఉదాహ‌ర‌ణ  పెనుకొండ మండలం శెట్టిపల్లి తండాలో శ‌నివారం జ‌రిగింది.   పెనుకొండ మండలం శెట్టిపల్లి తండాకు అధికారులు, పార్టీ నాయకులతో కలిసి మంత్రి  శంకర నారాయణ గడపగడపకు కార్యక్రమం నిర్వహిం చారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇంటింటికీ వెళ్లారు. ఈ క్రమంలో లలితా బాయి  అనే  మహిళ ఇంటి వద్దకు చేరుకోగానే ఆమె బంధువులు పింఛన్‌ రద్దు విషయాన్ని ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఇంతలో లలితా బాయి అనే మ‌హిళ బయటకు వచ్చి తన భర్త ఆనందనాయక్‌ పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, అప్పటి నుంచి తనకు వితంతు పింఛన్‌ వచ్చేదని తెలిపింది. స్థానిక వైసీపీ నాయ కులు తనకు పింఛన్‌ రాకుండా చేశారని, 11 నెలల నుంచి పింఛన్‌ అందడంలేదని ఎమ్మెల్యేకి వివరిం చింది. అంతా విన్న ఎమ్మెల్యే, తరువాత చూద్దాంలే.. అని చెప్పి, తేలిగ్గా తీసుకుని ముందుకు వెళ్లి పోయా రు.

దీంతో లలితా బాయి రగిలి పోయింది. ఏమిచ్చి పోగొట్టుకున్నారని మా ఇంటికాడికి వచ్చినార్రా.. ఇంకో సారి మా ఇంటి ముందుకొస్తే చెప్పుతో కొడతా. ఒకసారి మా ఇంటిని చూడండిరా..అని ఆగ్రహం వ్యక్తం చేసింది. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడికి రా.. అని ఎమ్మెల్యేపై  తొడ కొట్టి సవాల్ చేసింది. ఇంత‌కంటే వైసీపీ నాయ‌కుల‌కు వేరే అవ‌మానం ఉంటుందా?  జ‌గ‌న్‌కి వీరి మ‌నోవేద‌న ఇంకా ఎప్పుడు తెలుస్తుంది.

By
en-us Political News

  
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.