Publish Date:Jun 14, 2025
వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వైసీపీ సవాల్ విసిరారు. మంళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. వైసీపీ ఆరోపిస్తున్నట్లు ‘తల్లికి వందనం’ నిధులు మంత్రి లోకేష్ జేబులోకి వెళ్లినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా, నిరూపించలేకపోతే పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగలరా? అని జగన్కు సవాల్ విసిరారు.విద్య విలువ తెలిసిన నాయకుడు నారా లోకేష్ అయితే.. విద్యకు ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం అన్నారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు. రూ.67లక్షల 27వేల 164 మందికి తల్లికి వందనం అందజేశామని పేర్కొన్నారు.
దాదాపు రూ. 8,745 కోట్లు తల్లికి వందనం కింద డైరెక్టుగా తల్లుల అకౌంట్లలోకి నిధులు జమ అయ్యాయి. తల్లిదండ్రులు, పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ తల్లికి వందనం ఇవ్వడం గొప్ప విషయం. ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ బాబు ల కృషి ఎనలేనిదని మంత్రి సవిత పేర్కొన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తుండగా, అందులో రూ.2 వేలు పాఠశాల అభివృద్ధికి, మిగిలిన రూ.13 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. "ఇంట్లో ఒకరుంటే రూ.13 వేలు, ఇద్దరుంటే రూ.26 వేలు, ముగ్గురుంటే రూ.39 వేలు, నలుగురుంటే రూ.52 వేలు, ఐదుగురుంటే రూ.65 వేలు అందజేశాం. ఒక కుటుంబంలోని ముగ్గురు ఆడబిడ్డలకు ఈ పథకం అందడంతో వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు" అని మంత్రి పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-savita-25-199937.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.