ఆదర్శ రైతు మంత్రి రామానాయుడు..సొంత పొలంలో ఎన్ని బస్తాలు వడ్లు పండించారంటే?

Publish Date:May 8, 2025

Advertisement

 

రైతు బిడ్డగా వ్యవసాయం గురించి, రైతుల కష్టాల గురించి  తెలిసిన మంత్రి రామానాయుడు  ఆదర్శ రైతుగా నిలిచారు. ఆయన సొంత పొలంలో దాల్వా వరి సాగులో  ఎకరానికి 65 బస్తాలు అధిక దిగుబడులు సాధించారు. అతి తక్కువ పెట్టుబడులతో  యాజమాన్య పద్ధతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల  సూచనలు సలహాలతో అధిక దిగుబడులు సాధించినట్లు  పాలకొల్లు వ్యవసాయ సహాయ సంచాలకురాలు  అద్దాల పార్వతి, పాలకొల్లు మండల వ్యవసాయ అధికారి  కే రాజశేఖర్ లు తెలిపారు. పాలకొల్లు వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో   ఇరువురు వివరాలను వెల్లడించారు. పాలకొల్లు మండలం ఆగర్తి పాలెం గ్రామంలో మంత్రి రామానాయుడు తన ఆరు ఎకరాల  విస్తీర్ణంలో  వరి పి ఆర్  126  సన్న రకం ( గ్రేడ్ A) దాల్వా సాగు  చేశారు. 

ఎకరానికి 65 బస్తాలు చొప్పున ఆరెకరాల్లో  390 బస్తాలు దిగుబడి సాధించారు. అతి తక్కువ  పెట్టుబడులతో అధిక లాభాలు పొందారు.ఆయన  ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యలను తీర్చడంలోనూ, మరోపక్క  కీలకమైన జల వనరుల శాఖ మంత్రిగా  ఎంత బిజీగా, ఒత్తిడితో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఉండే రెండు రోజుల్లో  కొద్దిపాటి సమయం దొరికినప్పుడల్లా  పొలం కి వెళ్లి   స్వయంగా వ్యవసాయ పనులు చేశారు. నాట్లు వేయడం దగ్గర నుంచి  కలుపు తీయడం, ఎరువులు వేయడం, పురుగుమందులు  చల్లడం ఇలా ప్రతి పనిలోనూ వ్యవసాయ కూలీలతో కలిసి మేమేకమయ్యేవారు. పంటకు కావలసిన యాజమాన్య పద్ధతులు, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా సస్య సంరక్షణ చర్యలు తీసుకోవడం వంటివి చేశారు. 

ఎక్కడ పోల్లు గింజలు లేకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకున్నారు. సకాలంలో నారు పోసి నాట్లు వేయడం, ఎరువులు, నీటి యాజమాన్య పద్ధతులు, పురుగులు, తెగుళ్లు  నివారణ చర్యలు, నీటి ఎద్దడి లేకుండా  ఎప్పటికప్పుడు మురుగునీరు బయటికి తీసి పిలక దశలో చేనును ఆరబెట్టడం ద్వారా  పైరు,వేర్లకు గాలి వెళ్తురు బాగా తగలడం, అధికంగా పిలకలు మొలవడం వంటివి అధిక దిగుబడులకు సాధ్యమైంది. మరీ ముఖ్యంగా  వ్యవసాయ అధికారులు,శాస్త్రవేత్తల సూచనలు సలహాలను  ఎప్పటికప్పుడు పాటిస్తూ అధిక దిగుబడులతో మంచి ఫలితాలు సాధించారు. ప్రతి రైతు  ఈ విధంగా వ్యవసాయంలో  ప్రత్యేకమైన శ్రద్ధను కనపరిస్తే మంచి దిగుబడులు పొందవచ్చునని  ఏడీఈ పార్వతి, ఏడి రాజశేఖర్ లు తెలిపారు. ఆదర్శ రైతుగా నిలిచిన  మంత్రి రామానాయుడు ను వ్యవసాయ శాఖ తరపున  ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు  చెప్పారు.


 

By
en-us Political News

  
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.