మోపిదేవి అరెస్ట్ పై సిబీఐ వత్తిడి పెంచుతున్నబి.సి. సంఘాలు

Publish Date:Jun 18, 2012

Advertisement

వాన్ పిక్ వ్యవహారంలో మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణను సిబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో తాజాగా ఆయన కథలో ఓ కొత్తమలుపు చోటు చేసుకుంటోంది. మత్స్యకారుడైన వెంకటరమణను వదిలేస్తారని ఇంతవరకూ ఎదురుచూసిన ఆయన బంధువులు రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారుల సంఘాలతో ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా బి.సి.సంక్షేమశంఘం కూడా ఈయనను కాపాడుకోవాలని కదిలింది. దీంతో ఈయనను కేసు నుంచి బయటపడేసేందుకు నిరసన కార్యక్రమాలు ఇకపై హోరెత్తనున్నాయి. అన్ని జిల్లాల సంఘాలను రాష్ట్రరాజధానికి రప్పించి బి.సి. అయినందునే మోపిదేవిని ఎరగా వాడారని ఆందోళనకు నేపథ్యాన్ని చూపుతున్నారు. జగన్ లాంటి చేపకోసం సిబీఐ ఎరగా వాడుకున్న తరువాత వెంకటరమణను ఎందుకు వదలలేదని ఆందోళనకారులు ప్రభుత్వాన్ని డిమాండు చేయనున్నారు. మే 24న మంత్రి మోపిదేవి వెంకటరమణను అరెస్టు చేశారు. ఆ తరువాత ఆయన తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. డానికి ముందు సిబీఐ అరెస్టు చూపేటప్పుడు జి.వో.లపై తనకేమీ తెలియదని, అప్పటి సిఎం రాజశేఖరరెడ్డి తనను పిలిపించుకుని ఫైలుపై సంతకం చేయించారని ఆరోపించారు. అరెస్టై మంత్రి పదవికి రాజీనామా చేశాక సిఎం కిరణ్ కు ఆయన ఒక లేఖ రాశారు. తనను వై.ఎస్.ఆర్. సిఎం కార్యాలయానికి పిలిపించుకుని కార్యదర్శి సమక్షంలో సంతకాలు తీసుకున్నారని తెలిపారు.

 

 

అయితే ఆ తరువాత జగన్ ను అరెస్టు చేశారు. జగన్ తో సన్నిహితునిగా చెంచల్ గూడ జైలులో ఉంటున్న మోపిదేవి తన బెయిల్ పిటీషన్ లో ఆరోపణలు మార్చారు. వై.ఎస్. ప్రస్తావన ఎక్కడా లేకుండా ప్రధానకార్యదర్శి తదితరులు ప్రతిపాదనలను పంపితే మంత్రివర్గం ముందుంచానని మోపిదేవి వివరించారు. మంత్రివర్గం చర్చించి ఈ నిర్ణయం తీసుకుందని నమోదు చేసిన అంశానికి పొంతన లేకుండా మోపిదేవి ఇంకా పలు అనుమానాలకు తావిచ్చారు. అయితే సిబీఐ కూడా మోపిదేవి కస్టడీలో ఉడడంతో అతి పెద్ద నేరమైన మనీ లాండరింగ్ వ్యవహారం చుట్టూ కేసును నడిపింది. ఈ దశలోనే ఈది జగన్ కేసులో విచారణ ప్రారంభించింది. తాజాగా జగన్ ను చెంచల్ గూడ జైలులోనే విచారించేందుకు అనుమతి తీసుకుంది. దీంతో ఆ విచారణలో ఈది జగన్ ను మనీలాండరింగ్ వ్యవహారంలో ప్రశ్నిస్తుంది. దీంతో సిబీఐ వాన్ పిక్ వ్యవహారం తేల్చే అవకాశమే కనిపించటం లేదు. అందువల్ల మోపిదేవి విషయం తేలటానికి ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విచారణ జరగకుండా తనను ఖాళీగా ఉంచుకున్న సిబీఐ ఇంకా తాత్సారం చేసే అవకాశాలు ఉన్నాయని మోపిదేవి తన బంధువులకు తెలియజేశారు. దీంతో కొత్త మలుపుకు ఆయనే స్వయంగా బీజం వేసుకున్నట్లు అయింది. ఈ నిరసనల హోరు రాష్ట్రప్రభుత్వాన్ని కదిలిస్తే ఖచ్చితంగా బెయిల్ దొరికే అవకాశం ఉంటుందని వెంకటరమణ ప్లాన్. ఈ ప్లాన్ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో తెరపైనే చూడాలి.

By
en-us Political News

  

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

ఖరారైన రాష్ట్రపతి పాలన ...

రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...

విఫలమైన 'టి' కాంగ్రెస్

చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.

తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.

వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.

చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.

రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను

నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.

తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.