ఏపీలో మినీ ఎమర్జెన్సీ ?

Publish Date:Sep 26, 2023

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ లో ఏం జరుగుతోంది ? తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్  వెనక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమిటి? ఎన్నికలకు ఇక ఏడెనిమిది నెలలు మాత్రమే ఉన్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  ‘నిప్పు’తో చెలగాట మాడే భయంకర నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అందుకు ఆయనలో ప్రవహించే ఫ్యాక్యనిస్ట్  బ్లడ్ మాత్రమే కారణమా? కేవలం కక్ష సాధింపు లక్ష్యంతోనే జగన్ రెడ్డి ఈ వినాశకర నిర్ణయం తీసుకున్నారా? అంటే,  అందులో కొంత నిజం ఉన్నప్పటికీ అదే పూర్తి సత్యం కాదంటున్నారు. 

ఒక్క మాటలో చెప్పాలంటే, 1975 జూన్ 26 ఉదయం సూర్యోదయం వేళ,  తనను అరెస్ట్ చేసేందుకు తలుపు తట్టిన, పోలీసులతో  జేపీ (సర్వోదయ ఉద్యమ నేత) అన్న మూడే మూడు ముక్కల మాట ... గుర్తుకు తెచ్చుకుంటే చంద్రాబాబును జగన్ రెడ్డి ఎందుకు, అరెస్ట్ చేశారు అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆరోజు జేపీ... అన్నఆ మూడు ముక్కలూ  ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్న మాటలు. ఇంచుమించుగా 48 ఏళ్ల  క్రితం.. అలహాబాద్ హై కోర్ట్  తన ఎన్నికల చెల్లదని తీర్పు ఇచ్చిన నేపధ్యంలో  అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ  1977 జూన్  25 అర్థరాత్రి దేశంలో    ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించారు. జూన్ 26 తెల్లవారే సరికి  ఇందిరమ్మ పోలీసులు అప్పటికే ఇందిరా గాంధీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, సంపూర్ణ క్రాంతి ఉద్యమం పేరిట దేశవ్యాప్త ఆందోళనకు  పిలుపు ఇచ్చిన సోషలిస్ట్ నేత  జయప్రకాశ్ నారాయణ సహా వందల సఖ్యలో  ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేశారు. 

అలాగే  ఇప్పడు వైసీపీ అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా  తెలుగు దేశం, జనసేన పార్టీలు సాగిస్తున్న పోరాటం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో జగన్ రెడ్డి  ఓటమి భయంతో, రాష్ట్రంలో అప్రకటిత  మినీ ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే, జగన్ రెడ్డి పోలీసులు   2023 సెప్టెంబర్ 9వ తేదీ, ఉదయం 6 గంటలకు నద్యాలలో చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్ట్  చేశారు. ఇందిరమ్మ పోలీసులు చేసిన జేపీ, అరెస్ట్’,జగన్ రెడ్డి పోలీసులు చేసిన చంద్రబాబు అరెస్ట్ కు మధ్య కొన్ని సిమిలారిటీస్  ఉన్నాయి. అప్పుడు ఇందిరమ్మ పోలీసులు తెల్లవారుజామునే వచ్చి తపులులు తట్టారు, ఇప్పడు జగన్ రెడ్డి పోలీసులుఇంచుమించుగా అదే చేశారు. అయితే అర్ధరాత్రి చంద్రబాబు బస చేసిన బస్సు తలుపు తట్టారు.  అప్పుడు ఇందిరమ్మ పోలీసులు జేపీని ఎందుకు,ఏ నేరానికి, ఏ చట్టం, ఏ సెక్షన్  పరిధిలో  అరెస్ట్ చేశారో చెప్పలేదు.

ఇప్పడు జగన్ రెడ్డి పోలీసులూ అంతే  నేరం ఏమిటో, విచారణ ఏమిటో  చెప్పకుండానే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును, బస్సులోంచి దించి  ఎలాంటి కారణాలు చూపకుండానే అరెస్ట్ చేశారు. అలా అరెస్టు చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో జరిగినట్లు చెపుతున్న అవకతవకలు,అవినీతికి చంద్రబాబుకు సంబంధం ఏమిటో చెప్ప కుండానే, కేవలం సాంకేతిక అంశాల ఆధారంగ , విచారణ పేరుతొ వేధింపులకు గురి చేస్తోంది. అందుకే  చంద్రబాబు అరెస్ట్ విషయంలో  ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు  ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

నిజానికి అక్రమ అరెస్ట్ విషయంలోనే కాదు, అరెస్ట్ తరువాత తెలుగు దేశం నేతలు, కార్యకర్తలను ఎక్కడి కక్కడ అరెస్టులు చేయడం, నిరసన తెలిపేందుకు లేకుండా ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం.  అదే విధంగా  చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున నిరసనలను ఉక్కుపాదంతో అణచివేయడం,  దీక్షలను భగ్నం చేయడం చూస్తుంటే, ఏపీలో మినీ ఎమర్జెన్సీ అమలులో వుందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

By
en-us Political News

  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.