మెదడుతోనే వీడియోగేమ్

Publish Date:Dec 8, 2016

Advertisement

 


సాంకేతికత రోజురోజుకీ తెగ అభివృద్ధి చెందుతోంది. దాంతో ఒకప్పుడు సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలలోనే సాధ్యమనుకునే విషయాలు కళ్ల ముందే సాకారం అవుతున్నాయి. వాటిలో ఒకటి- కేవలం ఆలోచనలతోనే వీడియోగేమ్‌ను అడగలిగే శక్తి! వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఆ శక్తిని సాకారం చేసే దిశగా కొన్ని విజయాలు సాధించారు.

 

ఇదీ విధానం

కళ్ల ముందు కదిలిపోయే సన్నివేశాలలో మనం కూడా భాగంగా కనిపించే వర్చువల్‌ ఆటలకి (Virtual games)
కొదవలేదు. కానీ ఓ మనిషి మెదడులో మెదిలే ఆలోచనల సాయంతో అతని ఆటతీరు సాగే అవకాశం ఉందేమో అని శోధించే ప్రయత్నం చేశారు. అంటే ఇందులో ఆటగాడిలో ఎలాంటి శరీర కదలికా ఉండదన్నమాట. అతని తలకి కొన్ని పరికరాలు చుట్టి ఉంటాయన్నమాట.

 

ఇదీ ఆట

ఆటలో భాగంగా తెరమీద 21 చతురస్రాలు కనిపిస్తాయి. వాటిని పైకి కానీ కిందకి కానీ జరుపుతూ ఆటని కొనసాగించాలి. అది ఎటువెళ్లాలో ఆటగాడు నిర్ణయించుకున్నప్పుడు అతని మెదడులోని ‘ప్రాస్పేన్’ అనే భాగంలో స్పందనలు కలుగుతాయట. ఈ ‘ప్రాస్పేన్‌’ను కాంతిసంకేతాలుగా మార్చి వాటి ద్వారా వీడియోగేమ్‌ ఆడించే ప్రయత్నం చేశారు. శరీరం నుంచి నామమాత్రమైనా సహకారం లేకుండా, కనీసం కంటిచూపుని కూడా అనుసరించకుండా చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు విజయవంతం అవుతుందో అని పరిశోధకులు కూడా అనుమానపడ్డారు. కానీ 92 శాతం సందర్భాలలో ఆటగాళ్ల మెదడు ఏ తీరులో అయితే స్పందించిందో, దానికి అనుగుణంగా ఆట కదలడం చూసి సంబరపడిపోయారు.

 

 

ఆట కోసం మాత్రమే కాదు

వీడియోగేమ్‌ విజయవంతం అయ్యింది కదా అని ఈ పరిశోధన కేవలం ఆటలకే పరిమితం అనుకోవడానికి లేదు. మెదడులో ఆజ్ఞని అందించడం అనేది మన నిజజీవితంలో ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపుతుందంటున్నారు పరిశోధకులు. కారు తోలడం దగ్గర్నుంచీ కృత్రిమ అవయవాలని నియంత్రించడం వరకూ మెదడుతోనే పనికానిచ్చేయవచ్చు అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ కొత్త ఆవిష్కరణ మనకి ఆరో ఇంద్రియాన్ని ప్రసాదిస్తోందంటున్నారు.

 

ఇప్పటివరకూ మెదడు మీద జరిగిన ప్రయోగాలన్నీ అందులో ఉన్న సమాచారాన్ని ఎలా క్రోడీకరించాలి? అన్న దిశగానే సాగాయి. కానీ ఈ కొత్త ప్రయోగం ద్వారా మెదడుకి సమాచారాన్ని నేరుగా ఎలా అందించాలి? సమాచారాన్ని అందుకున్న తరువాత మెదడులో జరిగే ప్రతిస్పందనలకు ఎలా రూపం కల్పించాలి? అన్న తరహా పరిశోధనలకు దారితీసినట్లయ్యింది. మరి ఈ తొలి అడుగు మరెన్ని విజయాలకు దారితీస్తుందో!

 

- నిర్జర.
 

By
en-us Political News

  
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.