Publish Date:Jul 18, 2025
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగాల కోతకు కారణమౌతుందంటూ ఒక వైపు ఆందోళన వ్యక్తం అవుతుంటే.. మరో వైపు ప్రతిభావంతుల కోసం టెక్ దిగ్జజాలు కాగడా పెట్టి గాలిస్తున్నాయి. అలా ప్రతిభావంతులకు అనూహ్య స్ధాయి వేతనాలతో కొలువులోకి తీసుకుంటున్నాయి. ఒక వైపు మెక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఉద్యోగాల కోతతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలో ఆందోళన వ్యక్తం అవుతున్న సమయంలోనే.. ప్రతిభ ఉంటే కొలువులు వెతుక్కుంటూ కాళ్ల దగ్గరకు వస్తున్న సంఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం మెటా ఇద్దరు ఏఐ ఇంజినీర్లను గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయి వేతనాల ఆఫర్ చేసి మరీ కొలువులోకి తీసుకుంది. ట్రాపిట్ బన్సల్ , రూమింగ్ పాంగ్ అనే ఇద్దరు ఏఐ ఇంజనీర్లు మెటాలో రికార్డు స్థాయి వేతనాలతో ఉద్యోగులుగా చేరారు.
ఈ ఇరువురూ కూడా భారత సంతతికి చెందిన టెక్ నిపుణులే కావడం విశేషం. మెటా తన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనే కొత్త విభాగంలో పని చేసేందుకు భారత సంతతికి చెందిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు ఏకంగా 2400 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ ఉద్యోగాలిచ్చింది. వీరిలో ట్రాపిట్ బన్సల్‌కు ఎనిమిది వందల కోట్ల రూపాయల భారీ ఆఫర్ తో మెటాలో చేరారు. అలాగే రూమింగ్ పాంగ్ అనే మరో ఏఐ నిపుణుడిని అయితే రూ.1600 కోట్ల రూపాయల వేతనంతో కొలువులోకి తీసుకుంది. అంటే ఇద్దరు ఐటీ నిపుణులకు ఏకంగా 2400 కోట్ల రూపాయలు వెచ్చించింది.
భారతీయ మూలాలున్న ట్రాపిట్ బన్సల్, ఐఐటీ కాన్పూర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి . 2022లో ఓపెన్ ఏఐలో చేరారు. రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్, రీజనింగ్ మోడల్స్ అభివృద్ధిలో లక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఓపెన్ఏఐలో ‘O1’ అనే రీజనింగ్ మోడల్ డెవలప్‌మెంట్‌లో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇక రూమింగ్ పాంగ్ అయితే యాపిల్ కంపెనీ నుంచి వచ్చి మోటాలో చేరారు. యాపిల్ లో అత్యాధునిక ఏఐ సిస్టమ్‌ల డెవలప్ మెంట్ లో చాలా కీలకంగా వ్యవహరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/meta-mega-offer-to-two-techies-39-202197.html
ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన మహ్మద్ సిరాజ్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసలు కురిపించారు.
ఉక్కు పరిశ్రమ వ్యర్థాలను సంపదగా మలచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంది.
చట్ట సభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికను త్వరలోనే శాసన సభలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది.
ఏపీలో సెప్టెంబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా ఈ కొత్త బార్ పాలసీ అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు.
హైదరాబాదులో మరొకసారి భారీ వర్షం కుమ్మేసింది.. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్డు మీద వరద నీరు ఏరులై పారాయి.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. జగన్ భద్రత కోసం మరో నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించింది.
తెలంగాణ అంతర్జాతీయ స్పోర్ట్స్ చైర్మన్లు గా సంజీవ్ గోయంకా గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయంకా, యువర్ లైఫ్ సిఇఓ ఉపాసన కొణిదెల నియమితులయ్యారు.
ఏపీలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చాని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
కాళేశ్వరం కమీషన్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కమీషన్ రిపోర్ట్ ఊహించిందే. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని గులాబీ బాస్ అన్నారు.
సిరాజ్ మ్యాజిక్.. విజయానికి ఏడు పరగుల దూరంలో ఇంగ్లాండ్ ఆలౌట్
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన ఇంటి అద్దె భత్యం ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు.