పెళ్లి కుదరలేదని...యువకుడు ఆత్మహత్య

Publish Date:Nov 12, 2025

Advertisement

 

నేటి సమాజంలో యువకులకు పెళ్లి ఒక పెద్ద సమస్యగా మారింది... యువతుల కోరికలు ఆకాశంలో విహరిస్తున్నాయి. లక్షలు సంపాదించే ఉద్యోగంతో పాటు ఖరీదైన ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని షరతులు పెడుతున్నారు. ఇవి అన్ని ఉన్న యువకులను మాత్రమే ఎంచుకుంటున్నారు... దీంతో  చాలీచాలని జీతంతో సాదాసీదా జీవితం గడిపే యువకులకు పెళ్లి కుదరడం గగనమైంది. 

ఇక తనకు పెళ్లి కాదేమో అన్న భయంతో గతంలో కొందరు యువకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా జరిగాయి. ఇప్పుడు తాజాగా మేడ్చల్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది.పెళ్లి కుదరలేదనే మనస్థాపం తో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

మాధవరెడ్డి బ్రిడ్జి సమీపంలో బూర సురేష్‌ (30) అనే యువకుడు రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. అది గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోలీసుల దర్యాప్తులో వరంగల్ జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన బూర సురేష్ (30) గుర్తించారు. 

అతడు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి అమీర్‌పేట్‌లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ బట్టల షాపులో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కుటుంబ సభ్యులు గత నాలుగు సంవత్సరాల నుండి సురేష్ కు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు... అయినా కూడా ఏ ఒక్క సంబంధం కుదరలేదు...ఇన్ని సంవత్సరాలుగా యువతులను చూస్తున్నా కూడా ఏ ఒక్కరు తనను ఇష్టపడడం లేదని... ఇక తనకు పెళ్లి కాదేమోనని సురేష్  తీవ్ర స్థాయిలో మదనపడ్డాడు. 

దీంతో సురేష్ సుసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడాడు. అనంతరం అమీర్పేట్ నుండి ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోకి వచ్చి రేపల్లె ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకు న్నాడు. గత నాలుగేళ్లుగా వివాహ సంబంధాలు కుదరలేదని, దీనివల్ల మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వే పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొడుకు మరణించాడన్న విషయం తెలియగానే తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు..

By
en-us Political News

  
కేవలం 45 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం బాదిన ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించాడు.తన విధ్వంసకర బ్యాటింగ్ తో 18 ఏళ్ల రికార్డును సమం చేశాడు.
గుజరాత్ టైటాన్స్‌ను 99 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి నాలుగు వరుస పరాజయాల తరువాత తొలి గెలుపును అందుకుంది. ఈ విజయం జట్టు సమష్టి ప్రదర్శనతో లభించింది.
అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు గుర్తించారు, . సెల్లార్‌లో నిలిపి ఉంచిన వాహనాలతో పాటు అక్కడ భద్రపరిచిన పాత సోఫాలు, ఇతర గృహోపకరణాల అంటుకుని క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి.
ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డితో కలిసి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన మంత్రి, సమ్మె వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు డ్రైవర్లు, సిబ్బంది సహాయంతో బస్సులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో జంట హత్యలు కలకలం రేపాయి.
లోకేష్ పొరబాటున ఒక తల్లిగా భావించి విజయమ్మ పుట్టిన రోజుకు ఒక ట్వీట్ పెట్టిన పాపానికి అది అటు దిరిగి ఇటు దిరిగి ఎన్నో వివాదాలకు కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే సామాన్యులకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
ట్రంప్ పరిపాలనకు మునీర్ తో ఉన్న సాన్నిహిత్యం కొత్తది కాదు. కానీ ఇప్పుడు ఆ సాన్నిహిత్యం ఒక వ్యూహాత్మక పరీక్షగా మారింది. ఒకవైపు ఇరాన్ తో పరోక్ష చర్చలు సాగుతున్నాయి. మరోవైపు , మునీర్ కు టెహ్రాన్ అగ్ర సైనిక వర్గాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇక్కడ సమస్య మునీర్ మాట్లాడుతున్నారా లేదా అన్నది కాదు. ఆయన ఎవరి తరఫున, ఎంత పారదర్శకంగా, ఎంత నమ్మదగిన రీతిలో మాట్లాడుతున్నారన్నదే అసలు ప్రశ్న.
కోయంబత్తూరు వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.