జగన్ గాలి తీసేసిన ఆర్కే రోజా.!.. అమరావతి, మావిగన్ రెండూ ఒక్కటే అంటూ క్లారిటీ!

Publish Date:Jul 7, 2026

Advertisement

వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్ కు ఆర్కే రోజా దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. వైసీపీ సీనియర్ నాయకురాలు, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన ఆర్కే రోజా.. మావిగన్ అంటే అమరావతేనని కుండబద్దలు కొట్టేశారు. ఓ వైపు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి.. వచ్చే ఎన్నికలలో తమ నినాదం మావిగన్ అని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా జరుగుతాయనీ, మావిగన్ కు మద్దతు ఇచ్చే వారు వైసీపీకి, అమరావతి కావాలనుకునే వారు తెలుగుదేశం కూటమికి ఓటు వేస్తారనీ, ఎవరు గెలుస్తారో చూద్దామనీ సవాళ్లు విసురుతుంటే.. ఆర్కే రోజా మాత్రం మావిగన్, అమరావతీ ఒక్కటేననీ, ఏమీ తేడాలేదనీ చెబుతూ జగన్ గాలి తీసేశారు. 

జగన్ మావిగన్ ప్రతిపాదన తరువాత.. వైసీపీ ఆ పేరును తెగ ప్రచారం చేస్తున్నది. అయితే..  జగన్, వైసీపీ నేతల ప్రచారం జనాలు పెద్దగా పట్టించుకోలేదనుకోండి అది వేరు సంగతి.  జనం దాకా ఎందుకు వైసీపీలో పలువురు నేతలు కూడా మావిగన్ ప్రతిపాదనపై పెదవి విరిచారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెంది ధర్మాన వంటి నేతలైతే.. అంతర్గత సంభాషణల్లో జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.

 ఇక ఇప్పుడు తాజాగా ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత మావిగన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. జగన్ మావిగన్ ప్రతిపాదనపై రోజా తన అయోమయాన్ని బయటపెట్టుకున్నారు. అదే సమయంలో మావిగన్ పట్ల తన వైఖరినీ బయటపెట్టారు. మావిగన్, అమరావతి రెండూ ఒకటే కదా అని రోజా ఆ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో మావిగన్ ను ప్రమోట్ చేస్తున్న వైసీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిపోయింది.

తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలు మాత్రం రోజా వ్యాఖ్యలను తెగ వైరల్ చేస్తున్నారు. మావిగన్, అమరావతి ఒకటే అయినప్పుడు జగన్ మావిగన్ పాట పాడటం ఎందుకు, అమరావతిపై విషం చిమ్మడం ఎందుకు అంటూ నిలదీస్తున్నారు. జగన్ మావిగన్ జపం మాని రోజాను ఫాలో అవుతూ రెండూ ఒకటే అని ప్రకటించేయవచ్చుగా అంటూ వైసీపీలో మావిగన్ వ్యతిరేకులు కూడా అంటున్నారు.  

జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన, ఆయన పార్టీ నేతలూ    అమరావతిని  శ్మశానంతో పోలుస్తూతీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న అమరావతిపై విషం చిమ్ముతున్నారు. తాను అధకారంలోకి వస్తే.. మావిగన్ ను ఏపీ రాజధానిగా చేస్తామంటూ జగన్ ప్రకటనను గుప్పిస్తున్నారు. అయితే..  అనూహ్యంగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. అమరావతికి అనుకూలంగా గళం ఎత్తడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.    అభివృద్ధి, వైభవం పరంగా అమరావతి  అంతటి  స్థాయి కలిగిన ప్రాంతమని రోజా అనడంతో వైసీపీ నేతలు, మరీ ముఖ్యంగా జగన్ ఏం మాట్లాడాలో అర్ధం కాని అయోమయంలో పడిపోయారు.  

రోజాయే అమరావతి మావిగన్ ఒకటే అని చెప్పడంతో జగన్ మావిగన్ ప్రతిపాదనపై నెటిజనులు తెగ సెటైర్లు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ అయోమయానికి ఇదే నిదర్శనమని అంటున్నారు. అమరావతిపై అకారణ ద్వేషం వినా.. వైసీపీకి రాజధాని విషయంలో ఒక క్లారిటీ అంటూ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Roja Comments on Amaravati, YCP Capital Row, Roja Mavigan Controversy, AP Politics, Telugunews

By
en-us Political News

  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.