పల్నాడులో భారీ రుణ మేళా.!

Publish Date:Jul 17, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలోనే కాకుండా ఆర్థిక రంగంలో సరికొత్త చరిత్రకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట వేదికైంది. వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి, పారిశ్రామిక, ఆర్థిక, సామాజిక రంగాలు సరికొత్త పుంతలు తొక్కేలా కేంద్ర, రాష్ట్ర కూటమి ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా  భారీ రుణమేళా  నిర్వహించాయి. శుక్రవారం (జులై 17) జరిగిన  మెగా క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌కు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్,  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  హాజరై.. ఈ ప్రాంతంలో ఒక  కొత్త ఆర్థిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. నరసరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో జరిగిన  సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.

ఈ భారీ రుణమేళా ద్వారా పల్నాడు జిల్లా వ్యాప్తంగా   లక్షా మూడు వేల 246 మంది లబ్ధిదారులకు  3 వేల 216 కోట్ల  రుణాలను పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే జిల్లా పరిధిలో ఇంత భారీ స్థాయిలో బ్యాంకింగ్ రంగాన్ని భాగస్వామ్యం చేస్తూ ఆర్థిక సాయం అందించడం ఒక రికార్డుగా నిలిచింది.  ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు సంయుక్తంగా యూనియన్ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత  కింద సమకూర్చిన అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా పాఠశాల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.

పల్నాడు వెనుకబాటుతనాన్ని సమూలంగా తుడిచిపెట్టాలనే దృఢ సంకల్పంతో బ్యాంకర్లు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి.   బ్యాంకులు నేరుగా ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి ఎటువంటి కాగితాల వేధింపులు లేకుండా రుణాలు మంజూరు చేసే ప్రక్రియను చేపట్టడం విశేషం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని 28 మండలాల్లో క్లస్టర్ ఆధారిత మహిళా గ్రూపులను బలోపేతం చేసేందుకు  మహిళా క్లస్టర్ల ను ఏర్పాటు చేశారు. డ్వాక్రా సంఘాల మహిళలకు పెద్దపీట వేస్తూ వారి స్వయం ఉపాధికి భారీగా రుణాలు అందించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా ఆదివాసీ గిరిజన రైతుల వ్యవసాయ భూములను బ్యాంకర్లు కుదువ పెట్టుకుని  రుణాలు మంజూరు చేసే విప్లవాత్మక నిర్ణయానికి ఇక్కడ నుంచే శ్రీకారం చుట్టారు. దీనివల్ల గిరిజన రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కి మోసపోకుండా అధికారిక బ్యాంకింగ్ పరిధిలోకి రానున్నారు. అలాగే క్లీన్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహించేందుకు గాను జిల్లాలోని 7 గ్రామాలను ఒక ప్రత్యేక యూనిట్‌గా ఎంపిక చేసి పీఎం సూర్య ఘర్  పథకం కింద ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ రుణాలు అందజేశారు.

ఈ మెగా లోన్ మేళాలో కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా కిసాన్ క్రెడిట్ కార్డులు, పశుసంవర్ధక, మత్స్యకార రంగాలు, అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం పీఎం ముద్ర యోజన , పీఎంఈజీపీ , పీఎం స్వనిధి, పీఎం విశ్వకర్మ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద చిన్న వ్యాపారులకు ఆర్థిక చేదోడు అందించారు. వీటితో పాటు గృహ నిర్మాణం, వాహన, ఉన్నత విద్యా రుణాలు కూడా మంజూరు చేశారు. ఈ క్రెడిట్ అవుట్‌రీచ్ ద్వారా లబ్ధిదారులందరికీ రాబోయే ఒక నెల రోజుల్లోగా నిధులు నేరుగా వారి ఖాతాల్లోకి చేరనున్నాయి. 

Palnadu Credit Mela, Chandrababu Naidu, Nirmala Sitharaman, Narasaraopet Mega Loan Mela

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల దశాబ్దాల కల నెరవేరింది.
నరసరావుపేట వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక క్రెడిట్ అవుట్ రీచ్ బహిరంగ సభలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల పరిధిలోని దాదాపు లక్షా 3వేల మందికి పైగా లబ్థిదారులకు 3 వేల 216 కోట్ల భారీ రుణాలను చంద్రబాబు, నిర్మలా సీతారామన్ పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల సమీకరణాలు, ప్రాంతీయ భావోద్వేగాల చుట్టూనే తిరుగుతుంటాయి.
రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో ఆడే అవకాశం ఇసుమంతైనా లేదు. వయసు రీత్యానే కాకుండా ఫామ్ విషయంలో కూడా రోహిత్ ను వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఇసుమంతైనా లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లండన్ వేదికగా రోహిత్ శర్మకు ఒక ప్రత్యేకమైన, ప్రతిష్టాత్మకమైన వీడ్కోలు ఇచ్చేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ నగరంలోని ఫుట్‌బాల్ అభిమానులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
ఇటీవల సీనియర్ కాపు నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా కిర్లంపూడిలో చోటుచేసుకున్న పరిణామాలు కేవలం ఒక కుటుంబంలో జరిగిన విషాదం
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, . యెమన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాన్, సౌదీ అరేబియా మధ్య మొదలైన కొత్త ఘర్షణ పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్.. తన స్వార్థపూరిత వ్యూహాల వల్ల ఇప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని బయటకు రాలేక నిండా మునిగిపోతోంది.
కర్ణాటకలో సభ్యసమాజం తలదించుకునే అత్యంత ఘోరమైన సంఘటన ఒకటి వెలుగుచూసింది.
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా తమిళనాడు ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
వైఎస్సా ర్సీపీ నేత నాగార్జున యాదవ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన రంగారెడ్డి జిల్లా షాబాద్ వరుస హత్యల కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది
భారతీయ రైల్వే రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పడింది.
ప్రస్తుతానికి కోవిడ్ బారిన పడిన వారిలో ముగ్గురు రోగులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరే కాకుండా, కృష్ణా జిల్లాకు చెందిన ఒక మహిళకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.