కేసీఆర్, ఈటల ఒకటేనా! రాజకీయ డ్రామా చేస్తున్నారా?

Publish Date:Jun 16, 2021

Advertisement

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రంగానే తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల ఏం చేస్తారన్నది జనాలు ఆసక్తిగా గమనించారు. కేసీఆర్ టార్గెట్ గా తెలంగాణ ఉద్యమకారులందరిని రాజేందర్ ఏకం చేస్తారని ఎక్కువ మంది భావించారు. కొత్త పార్టీ దిశగానే ఈటల కూడా సంకేతాలిచ్చారు. కాని చివరికి ఆయన సొంత దుకాణం తన వల్ల కాదంటూ కమలం గూటికి చేరారు. ఈటల బీజేపీలో చేరడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కమ్యూనిస్టు భావజాలంతో ఎదిగిన ఈటల రాజేందర్... రైటిస్ట్ పార్టీలో చేరడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనపై పలు సంఘాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. 

తాజాగా   ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరడంపై మావోయిస్టు పార్టీ కూడా స్పందించింది. ఈటలకు సంబంధించి తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఘాటు లేఖ విడుదల చేశారు. ఈటల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను తెలంగాణ మావోయిస్టు పార్టీ ఖండించింది. ఈటల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ చేసిన ప్రకటనను జగన్ తప్పుబట్టారు. కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని ఈటల ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసిన అనంతరం హిందూత్వ పార్టీ అయినా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని జగన్ విమర్శించారు. ఇది సీఎం కేసీఆర్‌కు ఈటలకు మధ్య జరుగుతున్న పోరాటమని.. దీనితో తెలంగాణ ప్రజలకు సంబంధం లేదన్నారు.

కేసీఆర్, ఈటల ఒకే గూటి పక్షులని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్, ఈటల రాజేందర్ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తూట్లు పొడిచారన్నారు. వీరి పాలన ప్రజా వ్యతిరేకమైనదన్నారు. మొన్నటి వరకూ కేసీఆర్ పక్కనే ఉండి అధికారాన్ని అనుభవించిన ఈటల తన ఆస్తుల పెంపుదలకు యత్నించారని జగన్ విమర్శించారు. అందులో భాగంగా పేదల భూములను అక్రమంగా ఆక్రమించారన్నారు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తామని ప్రకటిస్తూ తన ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలో చేరారని జగన్ తన లేఖలో మండిపడ్డారు. ఈటల బీజేపీలో చేరడాన్ని  తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారన్నారు. మావోయిస్టులు కూడా తనకు మద్దతు ఇస్తారని ఈటల చెప్పుకోవడం పచ్చి మోసం అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని తప్పుపడుతూ మావోయిస్టుులు విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది. ఈటల అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వామపక్ష భావజాలం ఉన్న ఈటలకు మొదటి నుంచి ఉద్యమ సంఘాలే మద్దతుగా నిలిచాయి. ప్రజా సంఘాలు అండగా నిలిచాయి. ఈటలను కేసీఆర్ మంత్రివర్గం నుంచి తొలగించినప్పుడు కూడా ఉద్యమకారులు, ప్రజా సంఘాలే ఆయనకు మద్దతుగా కేసీఆర్ ప పై విరుచుకుపడ్డాయి. అయితే ఈటల బీజేపీలో చేరడంతో... ఈ సంఘాలన్నిఆయనకు దూరం అయ్యాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

By
en-us Political News

  
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.