కోవిడ్ వచ్చి తగ్గిన వారికోసం కేంద్ర ఆరోగ్యమంత్రి ప్రత్యేకంగా చేసిన ప్రకటన..

Publish Date:Oct 31, 2023

Advertisement

కోవిడ్ అనే పేరు వింటేనే ఎంత భయపడతామో అందరికీ తెలిసిందే. కరోనా మొదలైన దగ్గరనుండి అది వివిధ రకాల వేవ్ లు అంటూ ప్రజల మధ్యకు చొచ్చుకు వస్తూనే ఉంది. ఇది రెండు సార్లు చాలా పెద్ద విలయతాండవమే సృష్టించింది. చాలామంది కోవిడ్ కారణంగా చావు అంచులదాకా వెళ్లివచ్చారు. కోవిడ్ మరణపు రుచి చూపించిన తరువాత చాలామంది ఆరోగ్య దృష్ట్యా తీసుకుంటున్న  జాగ్రత్తలే ప్రాణాల మీదకు తెస్తున్నాయని వైద్యులు అంటున్నారు. సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రే  కోవిడ్ వచ్చి తగ్గినవారు ఎవరూ రెండేళ్ల వరకు కొన్ని పనులు చేయకూడదంటూ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి  డాక్టర్ మన్సుఖ్ ఎల్ మాండవ్య తెలిపిన ఆ విషయాలేంటో తెలుసుకుని వాటిని ఫాలో అవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యం కూడా..

కోవిడ్ సంభవించిన చాలామంది మీద పరిశోధనలు, దేశంలో సంభవిస్తున్న మరణాలను సర్వే చేసిన వైద్యులు కొన్ని విస్తుపోయే నిజాలు వెలిబుచ్చారు. దేశంలో సంభవిస్తున్న గుండెపోటు మరణాలలో కోవిడ్ గుప్పెట్లో చిక్కుకుని నరకం అనుభవించి మరీ బయటపడినవారే అధికశాతం మంది ఉన్నారు. అందుకే కోవిడ్ వచ్చి దాని నుండి బయటపడినవారు ఎవరూ అధికబరువులు ఎత్తడం, రన్నింగ్ చేయడం,  వేగవంతమైన డాన్స్, ఏరోబిక్ వ్యాయామాలు, అధిక శ్రమతో కూడుకున్న ఇంటి పనులు మొదలైనవాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

తీవ్రమైన వ్యాయామానికి, గుండెపోటుకు మధ్యగల సంబంధం గురించి వైద్యులు చేసిన పరిశోధనలలో చాలా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. చాలా తీవ్రమైన వ్యాయామాలు చేసినప్పుడు రక్తపోటు, శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం చాలా వేగంగానూ, ఆకస్మాత్తుగానూ జరుగుతున్నాయని వైద్యుల పరిశోధనలలో తేలింది. ఇది గుండెమీద ఒత్తిడి కలిగించి  గుండెపోటుకు దారితీస్తుంది.  ఇప్పటికే అధిక రక్తపోటు, గుండె సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

పైన చెప్పుకున్న విషయాల ప్రకారం కోవిడ్ బాధితులలో గుండె సంబంధ సమస్యల ప్రమాదం ఎక్కువ కాబట్టి వ్యాయామం ఆపేయాలనే ఆలోచన రావచ్చు. కానీ గుండె ఆరోగ్యంగా ఉండటానికి  వ్యాయామం చాలా అవసరం. అయితే తీవ్రమైన వ్యాయామం గుండెను దెబ్బతీస్తుంది. కాబట్టి  కోవిడ్ నుండి బయటపడినవారు గుండె ఆరోగ్యానికి, శారీరక ఫిట్నెస్ కోసం తేలికపాటి వ్యాయామాలను మాత్రమే ఎంచుకోవాలి. వాకింగ్, మెట్లు ఎక్కడం, యోగా, సైక్లింగ్ వంటి వ్యాయామాలు ప్రతిరోజూ చేయవచ్చు. అయితే నిశ్చలమైన జీవనశైలి నుండి మాత్రం తప్పక బయటపడాలి. ఒకే రకమైన జీవనశైలి ఉంటే శరీరానికి తగినంత మార్పు లభించదు. కాబట్టి తేలికపాటి వ్యాయామాలు చేస్తూ గుండెను, ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలి.

                                                      *నిశ్శబ్ద.

By
en-us Political News

  
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని..
చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో..
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు...
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు...
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం..
ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు....
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి.....
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది....
మారుతున్న కాలం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘సైనస్’ (Sinusitis) ఒకటి. సాధారణ జలుబులా ప్రారంభమై...
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.