Publish Date:Jan 15, 2025
మంచు కుటుంబంలో విభేదాలు ఇప్పట్లో చల్లారేలా లేవా అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఔననే సమాధానమే వస్తున్నది. ఇటీవల మంచుకుటుంబంలో విభేదాలు రచ్చకెక్కి పోలీసు కేసుల వరకూ వెళ్లిన సంగతి తెలిసిదే. కుటుంబం మోహన్ బాబు, విష్ణు ఒక వైపు, మనోజ్ మరో వైపు అన్నట్లుగా నిట్టనిలువుగా చీలిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ విభేదాలపై మీడియా కవరేజ్ సందర్భంగా మోహన్ బాబు ఒక విలేకరిపై దాడికి పాల్పడిన ఘటనపై ఆయనపై పోలీసు కేసు నమోదైంది. దీంతో ఆయన కొన్ని రోజులు అజ్ణాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించి తాత్కాలిక ఊరట పొందారు.
సుప్రీంలో అరెస్టు నుంచి తాత్కాలిక ఊరట వచ్చిన తరువాతే ఆయన బయటకు వచ్చారు. గత కొద్ది రోజులుగా ఆయన తిరుపతిలో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాలలో ఆయన పెద్ద కుమారుడు విష్ణు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంజు మనోజ్ మాత్రం ఇప్పటి వరకూ ఈ సంబరాలకు దూరంగా ఉన్నారు. భోగి, సంక్రాంతి వేడుకల్లో ఎక్కడా కనిపించని మనోజ్ కనుమ రోజున జరిగే సంబరాల్లో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. రంగంపేటలో బుధవారం (జనవరి 15)న జరిగే జల్లి కట్టు వేడుకల్లో పాల్గొనేందుకు నమోజ్ రానున్నారు. అనంతరం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వెల్లారని సమాచారం. ఇప్పటికే యూనివర్సిటీ వద్ద మోహన్ బాబు, విష్ణు ఉండటంతో.. మనోజ్ రాకతో అక్కడ మళ్లీ గొడవలు జరుగుతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మనోజ్ రాక సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ అవకాశం లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/manchu-family-disputes-25-191297.html
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.