కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనకు మమత సంఘీభావం.!
Publish Date:Jul 24, 2026
Advertisement
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ ) అధినేత్రి మమతా బెనర్జీ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం (జులై 27) జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు. దీంతో మమత కేంద్రంతో ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మమత ఢిల్లీ పర్యటన వెనుక విద్యార్థుల ఉద్యమానికి మద్దతు మాత్రమే కాకుండా, బలమైన రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇటీవలి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత.. ఎంపీ శతాబ్ది రాయ్ సహా ఏకంగా 20 మంది టీఎంసీ ఎంపీలు టీఎంసీని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలకు సంఘీభావంగా ప్రత్యక్షంగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొనడానికి మమతా బెనర్జీ హస్తిన వస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మమతా బెనర్జీ హస్తిన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనలో మమతా బెనర్జీ కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో పాటు ఇతర కీలక ప్రతిపక్ష పార్టీల నేతలతో వరుస భేటీలు నిర్వహించే అవకాశం ఉందన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీతో కలిసి మమత వేస్తున్న ఈ అడుగులు కొత్త రాజకీయసమీకరణాలకు దారితీసు అవకాశం లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Cockroach Janata Party, Jantar Mantar protest, Trinamool Congress TMC, Delhi protest July 27
http://www.teluguone.com/news/content/mamath-benerjee-delhu-tour-25-227032.html





