మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బోడుప్పల్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. బోడుప్పల్‌లోని ఓ ఖాళీ స్థలంలో మూడు కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అదే ప్రాంతంలో చెత్త కూడా పేరుకుపోయి ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకు నిప్పంటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మంటలు ఒక్కసారిగా పెద్దఎత్తున చెలరేగి సమీపంలో పార్క్ చేసిన కార్లకు వ్యాపించాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో మూడు కార్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
భారీగా ఎగసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నించడంతో పాటు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే మూడు కార్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చినా, వాహనాలు దగ్ధం కావడంతో వాటి యజమానులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెత్తకు నిప్పంటించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/major-fire-in-boduppal-36-221850.html
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్‌కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.