హైదరాబాద్‌లోని రద్దీ ప్రాంతమైన అమీర్‌పేట్‌లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మైత్రివనం సమీపంలోని ప్రధాన రోడ్డుపై పిల్లర్ నంబర్ 1043 వద్ద ఉన్న KSR ఫ్యాషన్స్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు దుకాణం మొత్తం వ్యాపించడంతో దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది.
మంటలను గమనించిన స్థానికులు, వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల కారణంగా సమీపంలోని హర్ష మెస్ వరకు పొగ వ్యాపించడంతో అక్కడి సిబ్బంది, వినియోగదారులు అప్రమత్తమై బయటకు వచ్చారు. దీంతో కొంతసేపు ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
షాప్‌లో పెద్ద మొత్తంలో వస్త్రాలు, ఇతర సామగ్రి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా అమీర్‌పేట్ ప్రధాన రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం ఎంత జరిగింది? ఎవరైనా గాయపడ్డారా? అనే వివరాలపై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/major-fire-in-ameerpet-36-221787.html
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్పల్లి మంజీరా మాల్లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.