Publish Date:Feb 18, 2026
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గం కింద ముస్లింలకు అమల్లో ఉన్న 5 శాతం రిజర్వేషన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం మంగళవారం(ఫిబ్రవరి 17) రాత్రి జీవో జారీ చేసింది. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వర్తించే ఈ రిజర్వేషన్ ను రద్దు చేస్తూ ముస్లింలకు ఈ కోటా ఇకపై ఉండదని స్పష్టం చేసింది.
2014లో అప్పటి నేతృత్వంలోని డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అప్పట్లో ఈ ఆర్డినెన్స్ రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రతిపక్షాలు ఇది ఎన్నికల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమని విమర్శించాయి. 2014 నవంబర్ 14న హైకోర్టు ముస్లింలకు 5శాతం రిజర్వేషన్లపై మధ్యంతర స్టే విధించింది. తరువాత ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. కోర్టు తీర్పులు, చట్టపరమైన అడ్డంకుల కారణంగా రిజర్వేషన్ పూర్తిగా అమలులోకి రాలేదు. డిసెంబర్ 23, 2014 నాటికి శాసనసభ ఆ ఆర్డినెన్స్‌ను చట్టంగా ఆమోదించకపోవడంతో గడువు ముగిసింది.
అయినప్పటికీ అధికారికంగా రద్దు ప్రకటన లేకపోవడంతో ఈ రిజర్వేషన్ అంశం ఎటూ తేలకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగా ఉండీ లేనట్లుగా కొనసాగుతోంది. దాదాపు పుష్కర కాలం తరువాత దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ముస్లింలకు 5శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. చట్టపరంగా అమలులో లేని కోటాని రద్దు చేసింది. అలా రద్దు చేస్తూ, ఇది కేవలం చట్టపరమైన స్పష్టత కోసం తీసుకున్న నిర్ణయమేననీ, అమలులో లేని అంశానికి ఫుల్ స్టాప్ పేట్టేశామని పేర్కొంది.
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఇది ముస్లింలకు పెద్ద దెబ్బగా పేర్కొంది. వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం వాటిని అడ్డుకుంటోందని విమర్శించింది. ఎంఐఎం అయితే దీనికి రంజాన్ తోఫాగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో ముస్లింల రిజర్వేషన్ అంశం మళ్లీ రాజకీయంగా ప్రధాన్యతను సంతరించుకుంది. మహారాష్ట్రలో రానున్న ఎన్నికలలో ఈ అంశం కీలకంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/maharashtra-government-camcil-muslim-reservations-39-214297.html
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.