కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్న మాజీ మంత్రి జూపల్లి!
Publish Date:Oct 27, 2011
Advertisement
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.అధికారికంగా ప్రకటించనప్పటికీ దాదాపు జూపల్లి కాంగ్రెసుకు గుడ్‌బై చెప్పి టిఆర్ఎస్‌లో చేరతారని ఊహాగానాలు జోరుగా ఊపందుకున్నాయి. ఈ నెల 30వ తారీఖున ఆయన కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. నవంబరు 1వ తారీఖు నుండి మూడు రోజుల పాటు టిఎఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇందిరా పార్కు వద్ద దీక్ష చేసే విషయం తెలిసిందే. ఈ దీక్షలలో జూపల్లి కూడా పాల్గొనే అవకాశాలున్నాయి.మూడవ తారీఖున దీక్షలు పూర్తవుతాయి. ఆ తర్వాత నవంబర్ 4న ఆయన టిఆర్ఎస్‌లో చేరతారు. ఇప్పటికే టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో జూపల్లి భేటీ అయి కాంగ్రెసుకు రాజీనామా, దీక్షలో పాల్గొనే అంశం, టిఆర్ఎస్‌లో చేరే అంశంపై మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
జూపల్లితో పాటు జిల్లాకే చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు కూడా టిఆర్ఎస్‌లో చేరనున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. కాగా ఇప్పటికే జూపల్లి తెలంగాణ కోసం మంత్రి పదవి కోసం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.కాగా టిఆర్ఎస్‌లో తాను చేరుతున్నట్లు వస్తున్న వార్తలను జూపల్లి ఖండించారు. తాను టిఆర్ఎస్‌లో చేరుతున్నాననే వార్తలు అవాస్తవమన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కోర్టుకు వెళతానని చెప్పారు. నవంబర్ 1వ తేదిన కాంగ్రెసు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసే దీక్షలో పాల్గొంటానన్నారు.
http://www.teluguone.com/news/content/mahabubnagar-24-7951.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





