కొల్లాపూర్ ఓట్లు కొల్లగొట్టేదెవరు?
Publish Date:Mar 13, 2012
Advertisement
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కొద్దిరోజుల క్రితం వరకు టిఆర్ఎస్ అభ్యర్ధి జూపల్లి కృష్ణారావుకు అనుకూల వాతావరణం కనిపించింది. అయితే కాంగ్రెస్ మంత్రులు ఈ పరిస్థితిని మార్చి తమ పార్టీ అభ్యర్ధి మామిళ్ళపల్లి విష్ణువర్ధనరెడ్డి విజయానికి తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా టిఆర్ఎస్ , కాంగ్రెస్ ల మధ్యనే ఉండబోతోంది. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన జూపల్లి కృష్ణారావు ప్రత్యేక తెలంగాణాకోసం కాంగ్రెస్ కు, మంత్రి పదవికి రాజీనామాచేసి టిఆర్ ఎస్ లో చేరారు. దీంతో టిఆర్ఎస్ కు చెందిన మామిళ్ళపల్లి విష్ణువర్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్ధిగా జూపల్లిని ఢీకొంటున్నారు. మామిళ్ళపల్లి వ్యక్తిగత సామాజికవర్గం ఓట్లతోపాటు కాంగ్రెస్ ఓటు బ్యాంకుపై కూడా ఆశలు పెట్టుకున్నారు. దీనికి తోడు విష్ణువర్ధనరెడ్డి తరపున కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమాహేమీలు రంగంలోకి దిగారు. జూపల్లి కృష్ణారావుకు బద్ధవిరోధి అయిన మంత్రి డికె అరుణ కొల్లాపూర్ లోనే మకాంవేసి జూపల్లి ఓటమికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీచేసిన విష్ణువర్ధనరెడ్డికి 23 వేల ఓట్లు పోలయ్యాయి. అప్పట్లో ఆయనకు వచ్చిన ఓట్లతోపాటు కాంగ్రెస్ ఓట్లను కూడా కలుపుకుంటే ఇప్పుడు ఆయన గెలుపు ఖాయమనే అంచనాతో కాంగ్రెస్ ఉంది. అంతేకాక జూపల్లి కృష్ణారావు, టిడిపి అభ్యర్ధి సిహెచ్ జగదీశ్వరరావుకు కూడా వెలమ సామాజికవర్గానికి చెందినవారు. దీనివల్ల ఆ సామాజికవర్గ ఓట్లలో చీలిక వచ్చి వారి ఓట్లశాతం మరింత తగ్గుతుందని కాంగ్రెస్ అంచనావేస్తోంది. గత ఎన్నికల్లో జూపల్లికి 58వేల ఓట్లు పోలయితే, జగదీశ్వరరావుకు 56 వేల ఓట్లు వచ్చాయి. పార్టీలు మారిన నేపధ్యంలో ఈ ఇద్దరు అభ్యర్ధుల ఓటు బ్యాంకుకు గుండిపడటం ఖాయమని, అలా జరగడంవల్ల తమ అభ్యర్ధికి ఇబ్ది జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/mahabubnagar-24-12591.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





