కొల్లాపూర్ లో జబ్బ చరుస్తున్న కామ్రేడ్ జబ్బార్
Publish Date:Mar 9, 2012
Advertisement
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్ధిగా పోటీచేస్తున్న ఎండి జబ్బార్ ముమ్మరంగా ప్రచారం చేస్తూ తన బలాన్ని పుంజుకుంటున్నారు. జబ్బార్ ఈ నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు ఏమాత్రం లేకపోయినప్పటికీ ఆయనకు ఓట్ల సంఖ్య పెరిగేకొద్ది ప్రధాన రాజకీయ పార్టీల్లో ఎవరో ఒకరికి గట్టి దెబ్బ తగులుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గత 30 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో సిపిఎం నాయకులుగా ఉన్న జబ్బార్ ఈ ఎన్నికల్లో సుమారు 10వేల ఓట్లు తెచ్చుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆయన ఇంటింటికీ తిరుగుతూ అన్ని ప్రధాన పార్టీల విధానాలను తూర్పారపడుతున్నారు. ఇప్పటిదాకా గెలిచిన అభ్యర్ధులందరూ ఈ ప్రాంతం బాగుకోసం కాకుండా స్వప్రయోజనాల కోసమే పాటుపడ్డారని, తాను గెలిస్తే ప్రజలకోసమే ప్రతిక్షణం కేటాయిస్తానని హామీ ఇస్తున్నారు. తెలంగాణా పేరుతో అన్ని రాజకేయ పార్టీలు ఈ ప్రాంత అభివృద్ధితో చెలగాటాలాడుతున్నాయని ఆయన విమర్శిస్తున్నారు. నీతి, నిజాయితీ గల పార్టీలు నేడు కరువయ్యాయని, ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే నాధుడే కనిపించడంలేదని ఆయన ఓటర్లకు వివరిస్తున్నారు. అందుకే తనకు అవకాశం ఇస్తే ప్రజల సమస్యలకను పరిష్కరించడానికి అసెంబ్లీ వేదిక చేసుకుని సంక్షేమం ఫలాలను అందరికీ దక్కేలా చూస్తామని ఆయన హామీ ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆయన చెబుతున్న మాటలను ప్రజలు ఆసక్తిగా వింటున్నారు. కొన్నిచోట్ల ఇప్పటిదాకా ఎందరికో ఓట్లు వేశాం, ఈసారి మీకే ఓటు వేస్తాం అని అంటుండటంతో ఇక్కడ సిపిఎం అభ్యర్ధికి కూడా కీలకంగా మారే వాతావరణం కనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/mahabubnagar-24-12509.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





