రసవత్తరంగా మారిన నాగర్ కర్నూల్ పోరు
Publish Date:Mar 9, 2012
Advertisement
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొని వుంది. పోటీచేస్తున్న ముగ్గురిలో ఇద్దరికి అపార రాజకీయ అనుభవం వుంది. మరో అభ్యర్ధి ఇటీవలే రాజకీయ రంగప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పూచకుళ్ళ దామోదర్ రెడ్డి అభివృద్ధి నినాదంతో పల్లె పల్లెలో ప్రచారం చేస్తున్నారు. 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న నేతలు నాగర్ కర్నూల్ కు ఒరగబెట్టిందేమీ లేడని, తనను ఎన్నుకుంటే నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తామని తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి మర్రి జనార్ధనరెడ్డి అంటున్నారు. తెలంగాణా రాష్ట్రసమితి మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేస్తున్న నాగం జనార్ధనరెడ్డి ప్రత్యేక తెలంగాణా నినాదంతో రంగంలో ఉన్నారు. అభ్యర్ధుల బలాలు, బలహీనతలు విషయానికి వస్తే.... స్వతంత్ర అభ్యర్ధి నాగం జనార్ధనరెడ్డికి ప్రతి గ్రామంలో అనుచర గణం ఉంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ధూం ధాంల పేరిట నియోజకవర్గం మొత్తం ఇప్పటికే ఆయన పర్యటించారు. ఆయనకు తెరాస, సిపిఐ, బిజెపిలు మద్దతు ప్రకటిస్తున్నాయి. అయితే ఆయన 20 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ మంత్రి పదవులు అధిష్టించినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దగా ఏమీ చేయలేదనే అపవాదు ఉంది. గతంలో నాగం వెంటవున్న కొంతమంది మండలస్తాయి, గ్రామస్తాయి నాయకులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవడం ఆయనకు కొంత ఇబ్బందిగా మారింది. తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి మర్రి జనార్ధనరెడ్డి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. తనకు ఒక అవకశంఇస్తే నియోజకవర్గ రూపరేఖలు మార్చేస్తానని ప్రచారం చేస్తున్నారు. తన పేరిట ఉన్న ఛారిటబుల్ ట్రస్ట్ తో ఏడాదికి ఒక్కో మండలానికి మూడుకోట్ల రూపాయలు వెచ్చించి ఆ మండల అభివృద్ధికి కృషిచేస్తామని, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుచేసి పేద విద్యార్ధులకు చదువుకునే అవకాశం కల్పిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఇన్నాళ్ళు స్తబ్దంగా ఉన్న తెలుగుదేశంపార్టీ కేడర్ లో మర్రి రాకతో ఒక్కసారిగా ఉత్సాహం కనిపించింది. అయితే గ్రామస్థాయిలో ఆయనకు నమ్మకమైన అనుచరగణం గాని, పార్టీకి పెద్దగా కేడర్ గాని లేకపోవడం ప్రధాన ప్రతికూల అంశాలు. కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలో ఉన్న దామోదర్ రెడ్డి వివాద రహితుడిగా, అన్ని వర్గాలను కలుపుకుని పోయే స్వభావం ఉన్నవాడిగా మంచి పేరుంది. మూడుసార్లు ఆయన నాగర్ కర్నూల్ బరిలో దిగి ఓడిపోయిన నేపధ్యంలో ఆయనపై ప్రజలు కొంత సానుభూతి చూపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ లో ఇతర నాయకుల సహాయ సహకారాలు పెద్దగా లేకపోవడం ఈయనకుగల ప్రధాన ప్రతికూల అంశం.
http://www.teluguone.com/news/content/mahabubnagar-24-12507.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





