పాలమూరులో చేతులు కలుపుతున్న రెడ్లు
Publish Date:Mar 13, 2012
Advertisement
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు శాసనసభ స్థానంలో ఒక్కసారి తప్ప ఎప్పుడూ బిసి అభ్యర్ధులే గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో రెడ్ల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ ఆ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ఒక్కరు మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు.2009లో జరిగిన ఎన్నికల్లో రాజేశ్వరరెడ్డి ఇక్కడ గెలుపొందడంతో ఈ నియోజకవర్గంలోని రెడ్డి కులస్తులు ఆనందపడ్డారు. అయితే వారి ఆనందం ఎంతోకాలం నిలువలేదు. రాజశ్వేరరెడ్డి హఠాత్తుగా మరణించారు. ఆ స్థానంలో ఆయన కుటుంబీకులకు వారసులుగా నిలబెడదామంటే ఆయనకు వారసులు కూడా లేరు. ఈ పరిస్థితిని గమనించిన బిజెపి పాలమూరులో పాగా వేయడానికి ప్రయత్నించింది. ఆ పార్టీ ఏరికోరి రెడ్డి కులానికి చెందిన వై. శ్రీనివాసరెడ్డిని తమ అభ్యర్ధిగా రంగంలో దింపింది. పార్టీ ఏదైనా ఇష్టమున్నా లేకపోయినా రంగంలో ఉన్న వ్యక్తి రెడ్డి కాబట్టి అతనికి మద్దతు ఇవ్వాలంటూ అన్ని పార్టీల్లోని రెడ్డికులస్తులు చేతులు కలుపుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్, టిడిపి, టిఆర్ఎస్ ల్లో ఉన్న కొందరు రెడ్డి నాయకులు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పి బిజెపి అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నారు. ఈ పరిణామాలు బిజెపికి సంతోషాన్ని కలిగిస్తున్నాయి. దీనికితోడు పాలమూరులో పోటీచేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్ధి మైనార్టీ వర్గానికి చెందినవాడు. దీంతో ఈ నియోజకవర్గంలోని హిందువులు తమ పార్టీవైపు మొగ్గుచూపుతారని బిజెపి భావిస్తోంది. ఇదే జరిగితే పాలమూరులో బిజెపి అభ్యర్ధి తన ప్రత్యర్ధులకు గట్టిపోటీ ఇస్తాడనటంలో సందేహం లేదు.
http://www.teluguone.com/news/content/mahaboobnagar-24-12584.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





