‘మహానటి’ మాధురి!

Publish Date:Aug 13, 2024

Advertisement

నటి సావిత్రి ఎప్పుడో పుట్టినందువల్లే ‘మహానటి’ ఆమె సొంతం అయిందిగానీ, దివ్వెల మాధురి అప్పట్లో పుట్టినా, సావిత్రి ఇప్పుడు పుట్టినా ‘మహానటి’ బిరుదు మాత్రం దివ్వెల మాధురి సొంతం అయ్యేది. అయినప్పటికీ, నేటితరం ‘మహానటి’ అని దివ్వెల మాధురిని పిలుచుకోవచ్చు. దువ్వాడ శ్రీనివాస్‌తో ‘ఆయనకిద్దరు’ వ్యవహారం రోడ్డుమీద పడిన తర్వాత రకరకాల సందర్భాల్లో మాధురి ప్రదర్శించిన నటనా చాతుర్యాన్ని గమనిస్తున్నవారు ఆమెకు తప్పనిసరిగా ‘మహానటి’ బిరుదు ఇచ్చి తీరాలని ఏకగ్రీవంగా తీర్మానిస్తారు. 

దువ్వాడ శ్రీనివాస్ విషయంలో తన గుట్టు పూర్తిగా రట్టు కాగానే మాధురి మొదటిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తీరు.. ఆ ప్రెస్‌మీట్లో మాధురి ఇచ్చిన హావభావాలు ఏవైతే వున్నాయో, అన్నిటికీ తెగించిన తెలుగు వనితలా  ఆమె వ్యవహార శైలి ఏదైతే వుందో అవి అదరహో. అక్రమసంబంధం ఆరోపణలు వచ్చిన ఏ మహిళా అంత ధైర్యంగా ‘అవును మాకు సంబంధం వుంది’ అని ప్రకటించడం నెవర్ బిఫోర్.... నెవర్ ఆఫ్టర్. ఆ తర్వాత పట్టు చీర కట్టుకుని, చక్కగా మేకప్ వేసుకుని మీడియా ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆమె ప్రదర్శించిన ఆత్మాభిమానం, తెగువ మామూలుగా లేవు. 

ఇక ఆత్మహత్య డ్రామాని రక్తికట్టించడం కోసం సేఫ్‌గా వుండే కారుతో తెలివిగా యాక్సిడెంట్ చేయడం, ఆ తర్వాత ఆస్పత్రిలో పూర్తిగా వాడిపోయిన ముఖంతో బెడ్ మీద పడుకుని, నేను బతకను.. ఆత్మహత్య చేసుకోవాలనే యాక్సిడెంట్ చేశాను.. అని విలపించడం. ఓ గంట తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి, అసలేం జరగనట్టుగా చాలా ధైర్యంగా మాట్లాడుతూ, తన ‘ఆయనకిద్దరు’ వ్యవహారం మొత్తాన్నీ తెలుగుదేశం పార్టీ అకౌంట్లో వేయడానికి శతవిధాలా ప్రయత్నించడం... ఇవన్నీ క్లాప్స్ కొట్టించుకునే అభినయ ప్రతిభకి తార్కాణాలు.

ఇక లేటెస్టుగా మాధురి మేడమ్ ఆస్పత్రి బెడ్ మీదే వుంటూ ఒక ఎమోషనల్ వీడియో తెలుగు జాతికి అందించింది. అందులో ఆమె చక్కగా మేకప్‌లో మెరిసిపోతూ చెయ్యి తిరిగిన రైటర్ రాసినట్టుగా వున్న ఎమోషనల్ డైలాగ్స్ మంచి ఎక్స్.ప్రెషన్‌తో చెబుతుంటే చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోవనిపిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ ‘ఆయనకిద్దరు’ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో ఏమోగానీ, తెలుగు ప్రజలకు మరో ‘మహానటి’ దొరికింది.. అది చాలు!

By
en-us Political News

  
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
భాగ్యనగర ప్రయాణ ముఖచిత్రం మారనుందా? నగరంలో మెట్రో రైలు సేవలను శివారు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని కల్పించే దిశ
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన వంద కోట్ల రూపాయల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల కుంభకోణంలో డీఎంకే సీనియర్ నేత
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేక శవంతో డెత్ డ్రామా.!
దేశ రాజధాని దిల్లీలో ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నా చావుకే రూ.40 కోట్ల విలువనా? లేక నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి! అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.