ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఐ.ఏ.ఎస్ పదవీ విరమణ

Publish Date:Apr 30, 2020

Advertisement

ఆంధ్రప్రదేశ్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఈ ఏప్రిల్ 30- గురువారం నాడు పదవీ విరమణ చేశారు. నవంబర్ 6వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి మానవ వనరుల అభివృద్ధికి బదిలీ అయిన దగ్గర నుండి ఆరు నెలల పాటు సెలవుపై ఉన్నారు. పదవీ విరమణ చేయాల్సిన దృష్ట్యా ఎల్.వి. సుబ్రహ్మణ్యం నిన్న జిఎడి కి రిపోర్ట్ చేసి గురువారం నాడు రిటైర్ అయ్యారు. 1983 బ్యాచ్ కి చెందిన ఎల్.వి.సుబ్రహ్మణ్యం అఖిల భారత సర్వీసులో మొదటి ప్రయత్నంలోనే 17వ ర్యాంకు సాధించారు. నల్గొండ జిల్లాకు శిక్షణకు వెళ్లిన మొదటి అధికారి సుబ్రహ్మణ్యం. 1986లో వరంగల్ జిల్లా ములుగు సబ్-కలెక్టర్ గా పని చేసిన సందర్భంలో సమ్మక్క సారలమ్మ జాతరలో ఎన్నో మంచి మార్పులు తీసుకొచ్చి ముఖ్యంగా భక్తుల మన్ననలు పొందారు.

పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిగా ఎల్.వి.సుబ్రహ్మణ్యం మూడేళ్ల పాటు పని చేసి గిరిజనుల మౌలిక అంశాలపై దృష్టి పెట్టి సృజనాత్మకమైన అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. గిరిజన భూములకు సాగునీటి సౌకర్యాలు, పోడు భూములను ఉద్యానవనాలుగా మార్చి అందరి ప్రశంసలు పొందారు. గిరిజన విద్యాభివృద్ధికి సృజనాత్మకమైన పథకాలను అమలు చేశారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా కొద్ది రోజులు పనిచేసాక, 1990లో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ అయ్యారు. ఈ సందర్బంగా గ్రామీణ, గిరిజన అభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.మధ్యలో ఒక సంవత్సరం పాటు బ్రిటన్ లో ఎకనామిక్స్ లో ఎం.ఎస్.సి డిగ్రీ కోసం యూనివర్సిటీ అఫ్ బ్రాడ్ఫోర్డ్ లో చేరారు. మళ్ళీ భారత్ కి వచ్చాక రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండిగా పని చేసిన సమయంలో భారీ గ్రామీణ గృహ నిర్మాణ పథకం అమలు చేస్తూ తక్కువ ఖర్చుతో కూడుకున్న సాంకేతికతను అమలు చేసి ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారు.

1987లో హైదరాబాద్ వాటర్ వర్క్స్ వైస్ చైర్మన్, ఎండి గా కంప్యూటరీకరణ ద్వారా వినియోగదారులకు మరింత చేరువలో సేవలు ఉండేలా సంస్కరణలు తీసుకొచ్చారు. చుట్టూ ఉన్న ఏడు మున్సిపాలిటీలలో (ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిథిలో ఉన్నాయి) నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచిన తీరు ప్రజలు, నాయకుల ప్రసంసలు అందుకుంది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కూడా ఎల్.వి.సుబ్రహ్మణ్యం హయాంలోనే చేపట్టారు.

జాతీయ క్రీడల నిర్వహణలో ప్రధాన భూమిక:
2002 లో హైదరాబాద్ లో జరిగిన 32 వ జాతీయ క్రీడలు ప్రతిష్టాత్మకమైనవి. అవి విజయవంతంగా పూర్తి కావడంలో ఎల్.వి.సుబ్రహ్మణ్యం పాత్ర కీలకం అయింది. గచ్చిబౌలి క్రీడా ప్రాంగణం ఏర్పాటు దేశంలోనే ఒక ఆదర్శవంతమైన నమూనా గా నిలిచింది. తన కనుసన్నల్లోనే రూపుదిద్దుకున్న క్రీడా మౌలిక సౌకర్యాల అభివృద్ధి వల్ల అంతర్జాతీయ స్థాయి క్రీడలకు హైదరాబాద్ వేదిక అయింది. పదోన్నతిలో భాగంగా వైద్య శాఖ, ఆర్ధిక శాఖ లో ముఖ్య కార్యదర్శిగా పని చేసారు.

ఎల్.వి.సుబ్రహ్మణ్యం. 2006లో స్వైన్ ఫ్లూ ప్రబలినపుడు దానిని ఎదురుకోడానికి ఆయన చూపిన నాయకత్వ పటిమను ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. మౌలిక రంగ అభివృద్ధిలో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఎల్.వి.సుబ్రహ్మణ్యం. 2007 లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అఫ్ ఏపి (ఇన్కాప్) ఎల్.వి. సుబ్రహ్మణ్యం హయాంలోనే స్థాపన జరిగింది. విమానాశ్రయాల వికేంద్రీకరణ, ఏపి లో గ్యాస్ పైప్ లైన్ల నెట్ వర్క్, ప్రతిష్ఠాత్మకమైన ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు ప్రణాలికల రూపకల్పన చేసి మౌలిక రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు.

ఈ 8 లైన్ల రోడ్ నెట్వర్క్ అత్యంత ఉన్నత ప్రమాణాలు కలిగిన ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునక అయింది. ఆయన చేపట్టిన ఓఆర్ఆర్ ప్రతిపాదనలే నేడు హైదరాబాద్ కు మణిహారం అయ్యాయి.

టీటీడీలో పలు కీలక సంస్కరణలు:
తిరుమల తిరుపతి దేవస్థానాలు కి ఎగ్జిక్యూటివ్ అధికారిగా విధులు నిర్వహించారు ఎల్.వి.సుబ్రహ్మణ్యం. తిరుమలేశుని సన్నిధిలో ఒక ఉన్నతాధికారిగా ఆయన అందించిన సేవలు దేవస్థానం అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. ధర్మ ప్రచార కార్యక్రమాలను రూపొందించి విస్తృతంగా అమలు చేశారు.

ఢిల్లీ, కురుక్షేత్ర, కన్యాకుమారి లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించడానికి ఎల్.వి.సుబ్రహ్మణ్యం చొరవ తీసుకున్నారు. టీటీడీ పాలనా వ్యవహారాల్లో తనదైన శైలిలో మార్పులు తెచ్చారు.

2019 ఏప్రిల్ 7 వ తేదీన ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు మేరకు ఎల్.వి.సుబ్రహ్మణ్యం రాష్ట్ర పాలనలో అత్యున్నతమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. సాధారణ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించి పలువురి ప్రశంసలు పొందారు. 2019 నవంబర్ 7వ తేదీన బదిలీ అయ్యాక సెలవుపై వెళ్లారు. 2020 ఏప్రిల్ 30వ తేదీ నాడు రిటైర్ అయ్యారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనే ఎల్.వి.సుబ్రహ్మణ్యం తన సేవలకు గుర్తింపుగా అనేక సంస్థల సత్కార సన్మానాలను అందుకున్నారు.

అందరికీ కృతజ్ఞతలు:
తన 36 సంవత్సరాల 8 నెలల 3 రోజుల ఉద్యోగ కాలంలో తోటి అధికారులు, ఉద్యోగులు ఎంతో సహకరించారని, వారందరికీ కృతజ్ఞతలని ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఈ సందర్బంగా అన్నారు. ప్రభుత్వ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ తనకు ఎంతో మంది ప్రేరణగా నిలిచారని చెప్పారు. కాల ప్రవాహం, వేగంతో సాగిందని ఇప్పుడు అనిపిస్తోందని, ఎంతో మంది శ్రేయోభిలాషులు తన ప్రస్థానంలో చేదోడు వాదోడుగా, తన వెంట ఉన్నారని, వారందరికీ రుణపడి ఉంటానని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఒక అద్భుత ఆశయాన్ని నమ్ముకొని, కొన్ని ఒడిదొడుకులు ఎదురైనా ముందుకు సాగుతున్న తనను తన బాగు కోరిన ఎందరో ముందుకు నడిపించారని, తన అనుభవం కూడా ఎంతో నేర్పిందని అయన చెప్పారు. కర్మణ్యే వాదికా రస్తే ... వంటి గీతా సారాలు తన చెవుల్లో ప్రతిధ్వనిస్తు తన పయనంలో మరింత నైతిక స్థైర్యాన్ని అందించాయని ఎల్.వి.సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రభుత్వంలో తనకు సహకరించిన నేతలు, అధిపతులకు కృతజ్ఞతలు తెలిపారు.

By
en-us Political News

  
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.