జనంలోకి లోకేష్.. అరెస్ట్ కు సర్కార్ కుట్ర?

Publish Date:Sep 28, 2023

Advertisement

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరిగి యువగళం పాదయాత్ర  ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం ఏపీ  అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పటికే ప్రకటించారు. లోకేష్ సైతం టీడీపీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ లో కూడా ఇదే విషయం చెప్పారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ రోజున యువగళం పాదయాత్ర ఎక్కడ ఆగిందో ఇప్పుడు తిరిగి అక్కడ నుంచే ప్రారంభం కానుంది. అయితే, లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టక ముందే అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతున్నదని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. చంద్రబాబు అక్రమ అరెస్టు తర్వాత లోకేష్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అక్రమ అరెస్టుపై దేశవ్యాప్తంగా చర్చకు తెరతీసి, జగన్ సర్కార్ కక్షపూరిత చర్యలను ఎండగడుతూ మద్దతు కూడగట్టే పనిలో ఉన్న లోకేష్ త్వరలోనే రాష్ట్రానికి వచ్చి యువగళం పాదయాత్ర పునఃప్రారంభించనున్నారు.

అయితే, జగన్ ప్రభుత్వం లోకేష్ ను కూడా అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసులు పెట్టి లోకేష్ పేరుని చేర్చిన ఏపీ సీఐడీ అధికారులు తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను ఏ14గా చేర్చారు. అంతే కాదు ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు దీని మీద పిటీషన్ కూడా దాఖలు చేశారు. ఆయనతో పాటు అప్పటి మంత్రి నారాయణపై కూడా సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో నారాయణ ఇప్పటికే యాంటిసిపేటరీ  బెయిల్ తెచ్చుకున్నారు. కాగా, లోకేష్ పాదయాత్రను పున:ప్రారంభించాలని చూస్తున్న నేపథ్యంలో యాత్ర ప్రారంభించకుండానే అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు టీడీపీలో మరో హడావిడి మొదలైంది.

ఇప్పటికే చంద్రబాబు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు లోకేష్ కూడా అరెస్ట్ అయితే   ఏపీ రాజకీయాలు  మరింత హీట్ ఎక్కడం ఖాయం. ఇప్పటికే చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రతీకార చర్యగా పరిశీలకులు తేల్చేశారు. ప్రజలు కూడా దీనిపై అనేక రకాలుగా చర్చలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు, సీఐడీ కేసుల విచారణ చూస్తున్న సామాన్య ప్రజలు ప్రభుత్వం చేతిలో వ్యవస్థలు పావులుగా మారడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ అరెస్టు చేస్తే కక్ష పూరితంగానే   ప్రభుత్వం ఈ కుట్రలకు తెగబడుతుందని ప్రజలు నిర్ధారణకు వచ్చేస్తారు. ఇప్పటికే జగన్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జనం, తెలుగుదేశం శ్రేణులు లోకేష్ అరెస్టు అవుతారనే ప్రచారం నేపథ్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుపై ఎక్కడికక్కడ దీక్షలు చేపడుతూ నిరసనలు తెలుపుతున్న తెలుగు తమ్ముళ్లు లోకేష్ అరెస్టుతో ఎలాంటి నిర్ణయాలకు దిగుతారన్నది అంచనా వేయడం కూడా కష్టమే.

 ఇప్పటికే ఒకవైపు చంద్రబాబు అరెస్టుతో వస్తున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్న వైసీపీ.. లోకేష్ అరెస్ట్ కి కూడా ప్రయత్నిస్తున్నదంటే టీడీపీకి వస్తున్న సానుభూతి ఎన్నికలలో తనను ఏమీ చేయలేదని భావిస్తున్నట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే చంద్రబాబు, లోకేష్ అరెస్టుతో టీడీపీని దెబ్బకొట్టి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నటు భావిస్తున్నారు. అధినాయకత్వాన్ని దెబ్బకొట్టి క్యాడర్ లో నిరాశను పెంచి తాను లబ్ది పొందే కుట్రలో భాగమే ఈ అరెస్టులని విశ్లేషిస్తున్నారు. అయితే, ఈ అరెస్టులు.. ప్రభుత్వ నిర్ణయాలు రోజురోజుకూ ప్రజలలో అసంతృప్తి, అగ్రహాలను పెంచుతున్నాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలలోనే ఈ అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తున్నది. చంద్రబాబు అరెస్టుపై నిరసన కార్యక్రమాలను అడ్డుకొనేందుకు ప్రభుత్వం పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నా బలహీన వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిరసన దీక్షలు చేపడుతున్నారు. జగన్ ప్రభుత్వ కక్షపూరిత నిర్ణయాలపై ప్రజలలో చర్చ జరిగేలా చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత నషాళానికి ఎక్కడం ఖాయంగా కనిపిస్తుంది.

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.