ఏరులై పారుతున్న మద్యం.. బహిరంగంగానే పంపిణీ!

Publish Date:Oct 23, 2023

Advertisement

రాష్ట్రంలో మద్యం అనేది లేకుండా చేస్తా.. మందు అంటే ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్స్ లో మాత్రమే దొరికేలా చేస్తా. అమ్మల్లారా.. అక్కల్లారా వింటున్నారా.. ఇదీ మీ బిడ్డ జగన్ ఇస్తున్న హామీ. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించి చూపిస్తా అంటూ గత ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఊరూరా తిరిగి చెప్పారు. మాట ఇస్తే చేస్తాడంతే అంటూ వైసీపీ నేతలు ప్రజల చెవులలో ఊదరగొట్టారు. మాట తప్పడు.. మడమ తిప్పడు అంటూ విపరీతంగా ప్రచారం చేశారు. కానీ, అధికారంలోకి వచ్చాక.. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాకా రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారు. మద్యపాన నిషేధం హామీని మరవడమే కాకుండా కొత్త కొత్త కంపెనీలను తెచ్చి ఏ మాత్రం ప్రామాణికాలు లేకుండా క్వాలిటీలేని మద్యంతో ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. అధికారంలోకి రాగానే మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించేలా జీవోలు తెచ్చి మద్యాన్నితన ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. వైసీపీ నేతలే ఇప్పుడు గ్రామ గ్రామానికి బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ప్రజల జేబులను, ఆరోగ్యాన్నీ గుల్ల చేసి జేబులు నింపుకుంటున్నారు.

 ఇక, ఇప్పుడు అదే నాసిరకం మద్యాన్ని వైసీపీ నేతలు రాష్ట్రంలో ఉచితంగా పంపిణీ చేస్తూ ఓట్లుగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వైసీపీ వై నాట్ 175 అన్న నినాదాన్ని వినిపించిన సంగతి తెలిసిందే. అంటే  టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా గెలుపొందుతామని వైసీపీ ప్రగల్భాలు పలికింది. అయితే, ఆ తర్వాత రాష్ట్రంలో పరిణామాలను చూసిన వైసీపీ ఈ నినాదాన్ని పక్కన పెట్టింది. కానీ, కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు రకరకాల ప్రణాళికలు రచిస్తున్నారు. ఎమ్మెల్సీ భరత్ ను వచ్చే ఎన్నికల్లో కుప్పం నుండి పోటీ చేయించాలని భావిస్తున్న జగన్.. ఆయనకు ఆర్ధికంగా కూడా   అండగా ఉంటూ వస్తున్నారు. భరత్ ఏది అడిగితే అది చేసేలా వైసీపీలో చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఫుల్ పవర్ ఇచ్చారు. దీంతో పోలీసు, రెవెన్యూ అంతా భరత్ కనుసన్నల్లోనే మెలిగేలా చేసుకున్నారు. కాగా, ఇప్పుడు చంద్రబాబు టార్గెట్ గా కొత్త కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు.

చంద్రబాబును   అరెస్ట్ చేశారు.  ఇదే ఆదునుగా భావిస్తున్న వైసీపీ కుప్పాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. ముందుగా చంద్రబాబు అవినీతిపరుడని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అయితే, దీనిపై ప్రజల నుంచి అనుకున్నంత స్పందన రాకపోవడంతో నియోజకవర్గంలో భారీగా  సభలు, సమావేశాలు నిర్వహిస్తూ జనసమీకరణ చేస్తున్నారు. ఈ సభలకు హాజరయ్యే వారికి సకల ఏర్పాట్లు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో సభ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ తమ వైపుకు తిప్పుకొనే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సభకు జనాలను బలవంతంగా తరలించి వారికి భారీగా మద్యం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. సమావేశానికి ముందు.. సమావేశం అనంతరం సభా ప్రాంగణంలోనే భారీగా మందు పంపిణీ చేయడం విశేషం. 

ఈ సభకు వచ్చే మార్గాలలో కూడా వందలాది మందికి బహిరంగంగానే మద్యం పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలు, ఫోటోలు చూస్తున్న నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన మద్యపాన నిషేధం ఇదేనా అంటూ  ప్రశ్నిస్తున్నారు. జగన్ తెచ్చిన చీప్ లిక్కర్ మద్యంతో ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరుతున్నారు. మాట తిప్పడు మడమ తిప్పడు అంటూ మైక్ దొరికితే భజన చేసే మంత్రి రోజా తదితరులకు ఈ వీడియోలు కనిపించడం లేదా అంటూ నిలదీస్తున్నారు. మీరు మంత్రిగా ఉండి కూడా మీ జిల్లాలోనే ఇలా బహిరంగంగా ప్రజలకు ఉచితంగా మద్యం పంపిణీ చేస్తుంటే మీ కళ్ళు మూసుకుపోయాయా అంటూ రోజాను ట్యాగ్ చేస్తూ విపరీతంగా తిట్టిపోస్తున్నారు. మీరు ఎంతగా ఇలా బజారు కెక్కితే అంతగా నష్టం పెరుగుతుందే తప్ప చంద్రబాబును ఓడించడం మీ తరం కాదంటూ తెలుగు తమ్ముళ్లు కామెంట్స్ చేస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.