నారా లోకేష్ సీఎం.. లైన్ క్లియర్.. నాగబాబు ప్రశంసల సంకేతం అదేనా?

Publish Date:Mar 17, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు విస్తృతంగా జరుగుతున్న చర్చ మంత్రి లోకేష్ కు సీఎంగా ప్రమోషన్ కు లైన్ క్లియర్ అయ్యేదెపుడు? జనసేనాని పవన్ కల్యాణ్ సమ్మతిస్తారా? అన్నదే. అయితే ఈ విషయంలో ఎటువంటి సందేహాలకూ తావు అవసరం లేదనీ, లోకేష్ కు ప్రమోషన్ విషయంలో జనసేన నుంచి ఎటవంటి అభ్యంతరాలూ ఉండవన్న సంకేతాలు వస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. మరో దశాబ్దంనర పాటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని సమయం వచ్చిన ప్రతి సందర్భంలోనూ జనసేనాని పవన్ కల్యాణ్ ఉద్ఘాటిస్తూనే ఉన్నారు. అయినా రాజకీయవర్గాలలో ఈ విషయంలో డౌటానుమానాలు వ్యక్తమౌతూనే వస్తున్నాయి. అయితే తాజాగా జనసేన కీలక నేత, ఎమ్మెల్సీ, స్వయంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు అయిన నాగబాబు చేసిన ట్వీట్ తో ఈ డౌటానుమానాలన్నీ దూది పింజెల్లా తేలిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇంతకీ విషయమేంటంటే.. ఏపీ రాజకీయాలలో కూటమి నేతల మధ్య సమన్వయం బలంగా ఉందనీ, విభేదాలు, భిన్నాభిప్రాయాలూ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవాలేననీ తేలిపోయేలా నాగబాబు మంత్రి లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు.  లోకేష్ రాజకీయ పరిణితి, ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరు అద్భుతమని నాగబాబు ఇటీవల సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ గా మారింది. లోకేష్ పై నాగబాబు ప్రశంసల వర్షం కురిపించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా పోలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చకు కూడా దారితీసింది. 

 ఇటీవల ఒక పాఠశాలలో జరిగిన ఘటనపై లోకేష్ తక్షణమే స్పందించడం, తప్పును ఒప్పుకుంటూ క్షమాపణలు చెప్పడంపై  స్పందించారు.  అధికారంలో ఉన్న వ్యక్తి చిన్న పొరపాటు జరిగినా బాధ్యత తీసుకోవడం అనేది ఒక ఉత్తమ నాయకత్వ లక్షణమని, ఆ లక్షణం లోకేష్ లో పుష్కలంగా ఉందనీ నాగబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకులలో లోకేష్ ముందు వరుసలో ఉన్నారని పేర్కొన్నారు.  లోకేష్ నాయకత్వ పటిమను ప్రస్తుతిస్తూ నాగబాబు చేసిన ట్వీట్.. రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాలలో లోకేష్ ప్రాధాన్యత కలిగిన పాత్ర పోషించడానికి లైన్ క్లియరెన్స్ లో పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

వాస్తవానికి గతంలో లోకేష్‌పై విమర్శలు చేసిన వారు సైతం, ఇప్పుడు ఆయన తనను తాను మేకోవర్ చేసుకుని ప్రజానాయకుడిగా ఎదిగిన విధానాన్ని ప్రశంసిస్తున్నారు.  క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవ్వడం, పాలనలో తనదైన ముద్ర వేయడం ద్వారా లోకేష్ తన గ్రాఫ్ ను పెంచుకున్నారు. నాగబాబు వంటి కీలక నేత ఈ స్థాయిలో స్పందించడం వెనుక కూటమిలోని ఐక్యత ప్రస్ఫుటం కావడంతో పాటు.. లోకేష్ కు ప్రమోషన్ కు లైన్ క్లియర్ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  భవిష్యత్తులో ముఖ్యమంత్రి రేసులో లోకేష్ కు జనసేన నుంచి ఎటువంటి అభ్యంతరాలూ ఉండవన్న సంకేతాన్ని నాగబాబు తన ట్వీట్ ద్వారా ఇచ్చినట్లైందని అంటున్నారు.     

By
en-us Political News

  
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజ‌క‌వ‌ర్గం ఎంత చిన్న‌గా ఉంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధాన ప్రతిపక్షం అయ్యుండీ ఎన్నికల సన్నాహాల విషయంలో ఇంత నిర్లప్తంగా, నిరాసక్తంగా వ్యవహరించడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎన్నికలంటేనే స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు, అగ్రనేతల ప్రసంగాలతో నానా హడావుడీ చేసే కాంగ్రెస్ లో ప్రస్తుతం నమ్మశక్యంకాని నిశ్శబ్ధం తాండవిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.