లైఫ్ పార్ట్నర్ ను ఉపయోగించుకునే వాళ్లు ఎలా ఉంటారంటే..!

Publish Date:Jan 4, 2025

Advertisement



ప్రతి వ్యక్తి జీవితంలో భాగస్వాముల పాత్ర చాలా ప్రత్యేకమైనది. జీవితంలో ఒక దశ వచ్చాక బయటి నుండి ఒక వ్యక్తి జీవితంలోకి వస్తారు.  వారితోనే ఇక జీవితం అనుకోవాల్సి ఉంటుంది. కష్టం, నష్టం, సుఖం,  బాధ.. ఇలా అన్నీ వారితోనే పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఎలాంటి సమస్యలు లేకుండా సాగడం చాలా అరుదు.  ఎందుకంటే ఇద్దరు వేర్వేరు వ్యక్తులు,  వేర్వేరు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు, వేర్వేరు ప్రాంతాలలో పెరిగిన వ్యక్తులు ఒకచోట కలసి ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు రావడం సహజమే.. కానీ ఇద్దరూ నిజాయితీగా ఉండే వ్యక్తులు అయితే సమస్య ఎక్కువ ఉండదు. కానీ ఒకరు కుటిల మనస్తత్వం కలిగిన వారు అయితే వారితో బంధం సాగడం కష్టమే కాదు.. అలాంటి వారు తమ భాగస్వామిని వాడుకోవాలని చూస్తారు. అలాంటి వారు ఎలా ఉంటారో.. వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుంటే..

అపరాధ భావం..

లైఫ్ పార్ట్నర్ తప్పు చేసిన భావనను వ్యక్తం చేయడం ద్వారా తన పార్ట్నర్ ను తనకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇందులో ఎమోషనల్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది.  లైఫ్ పార్ట్నర్ ఏం చేస్తారంటే.. తన అవసరాలను,  తన సంతోషానికి తగిన విధంగానూ తన పార్ట్నర్ లేరు అనే విధంగా బిహేవ్ చేస్తారు. దీనికి తగిన కారణాలను కూడా వ్యక్తం చేస్తారు. దీంతో పార్ట్నర్ కోసం మారిపోయే అమాయకులు ఉంటారు. ఇలా మారిపోగానే తమ అవసరాల కోసం వాడేసుకుంటూ ఉంటారు.

ఎమోషనల్ బ్లాక్మెయిల్..

ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అనేది చాలా దారుణమైన చర్య.  ఇది మనిషిని నేరుగా ఏమీ అనకుండా తమకు నచ్చినట్టు మార్చుకునే మార్గం.  తన భాగస్వామిని తన అవసరాల కోసం ఉపయోగించుకోవాలి అనుకునే లైఫ్ పార్ట్నర్ కూడా అలాగే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. వారు చెప్పిన మాట వినకపోతే కోపంగా ఉండటం, విచారంగా ఉండటం, అదే పనిగా బాధపడటం వంటివి చేస్తారు. ఇలా చేస్తే వారికోసం మారిపోతారని వారికి తెలుసు.

అబద్దాలు..

అబద్దాలు జీవితంలో కొన్ని సందర్భాలలో చాలా ముఖ్యం. ఇవి చాలా సహాయపడతాయి.  జీవితాలను నిలబెడతాయి.  కొన్ని పనులను సులభతరం చేస్తాయి.  ఎదుటివారికి నష్టం జరగనంతవరకు  అబద్దం చెప్పడం తప్పేమీ కాదు.. కానీ భాగస్వామి అబద్దాలు చెప్పడం ద్వారా తన పార్ట్నర్ ను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రతి విషయంలో ఎప్పుడూ అబద్దాలు చెబుతుంటారు. తప్పు సమాచారాన్ని ఇవ్వడం ద్వారా తప్పు దారిలో పార్ట్నర్ ను తీసుకెళతారు.  దీనివల్ల వారు లాభపడి,  పార్ట్నర్ ను వాడుకుంటారు.

గ్యాస్ లైటింగ్..

గ్యాస్ లైటింగ్ చాలామందికి తెలియదు కానీ.. ఇది మనిషిని మానసికంగా గందరగోళానికి గురి చేసే చర్య. ఏదైనా మర్చిపోయినట్టు,  ఏదైనా గుర్తులేనట్టు,  మతి భ్రమించిందని నమ్మించేట్టు, జ్ఞాపకశక్తి క్షీణించిందని చెప్పడం,  పిచ్చి పట్టిందని నమ్మేలా చేయడం.. అబద్దాలు చెబుతున్నారని నిందలు వేయడం, అనుమానించడం, మనుషులలో కలవనీయకుండా ఒంటరిగా ఉంచడం, కుటుంబ సభ్యులు, స్నేహితులకు దూరం చేయడం..   ఇలాంటివి చేసి మనిషిని మానసికంగా ఆలోచలు లేకుండా, వారు ఎప్పుడూ ఇతరుల ముందు మాట్లాడకుండా చేస్తారు.  ఇలాంటివి చేసే వారు తమ భాగస్వామిని చాలా దారుణంగా ఉపయోగించుకుంటూ ఉంటారు.

                                          *రూపశ్రీ.

By
en-us Political News

  
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.