షాకింగ్ న్యూస్‌.. ఒమిక్రాన్‌పై ప‌నిచేయ‌ని కొవిషీల్డ్‌!.. బూస్ట‌ర్ డోస్ మ‌స్ట్‌!

Publish Date:Apr 25, 2022

Advertisement

అవును, నిజ‌మే. ఒమిక్రాన్‌ను అడ్డుకోవ‌డంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేయ‌ట్లేద‌ని తాజా అధ్య‌య‌నంలో తేలింది. కొవిషీల్డ్ తీసుకున్న ప‌లువురిపై జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో ఆ విష‌యం వెల్ల‌డైంది. ఆ ప‌రిశీల‌న‌లు చేసింది కూడా పుణేలోని ప్ర‌ఖ్యాత భారత వైద్య పరిశోధనా మండలి-ఐసీఎంఆర్ కి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ-ఎన్‌ఐవీ. దీంతో.. కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారంతా ఈ వార్తతో అల‌ర్ట్ కావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అందుకే, బూస్ట‌ర్ డోస్ త‌ప్ప‌నిస‌రి అంటున్నారు. 

ఢిల్లీకి చెందిన ఓ ఆరోగ్య కార్యకర్త (38) టీకా తీసుకోవడానికి ముందు ఒకసారి.. కొవిషీల్డ్‌ తీసుకున్న తర్వాత రెండుసార్లు కరోనా బారినపడ్డాడని ఎన్ఐవీ శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ సోకడంతో పాటు కొవిషీల్డ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారి రోగ నిరోధక వ్యవస్థనూ ఒమిక్రాన్‌ వేరియంట్‌ తప్పించుకోగలదని ఈ అధ్యయనంతో నిరూపితమైందని అంటున్నారు. కొవిడ్‌ టీకా బూస్టర్‌ డోసును తీసుకోవడం అత్యవసరం అనేందుకు ఇదొక సంకేతమని చెబుతున్నారు. 

పరిశోధకుల కథనం ప్రకారం.. ఆ ఆరోగ్య కార్యకర్తకు తొలిసారిగా 2020 అక్టోబరు 9న కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఏడాది తర్వాత (2021 నవంబరులో) అతడిలో మళ్లీ కొవిడ్‌ లక్షణాలు కనిపించగా.. పరీక్ష చేయించుకుంటే డెల్టా వేరియంట్‌ సోకిందని వెల్లడైంది. రెండు నెలల్లోనే మరోసారి కరోనా సోకింది. ఇటీవ‌ల‌ 2022 జనవరి 24న ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్టు తేలింది. టీకా తీసుకున్నా ఇలా వ‌రుస‌గా క‌రోనా బారిన ప‌డ‌టం క‌ల‌క‌లం రేపింది.

ఆ ఆరోగ్య కార్యకర్త కొవిషీల్డ్‌ టీకా మొదటి డోసును 2021 జనవరి 31న, రెండో డోసును మార్చి 3న తీసుకున్నాడు. టీకా బూస్టర్‌ డోసులు ఒమిక్రాన్‌ వేరియంట్‌పై మెరుగైన రోగ నిరోధక స్పందనను కలిగిస్తున్నందున..  కొవిషీల్డ్‌ తీసుకున్న వారు మూడో డోస్ తీసుకొని.. త‌గినంత‌ రక్షణ పొందవ‌చ్చని పరిశోధకులు సూచించారు. ఈమేరకు ఆ అధ్యయన నివేదిక ‘జర్నల్‌ ఆఫ్‌ ఇన్ఫెక్షన్‌’లో ప‌బ్లిష్ అయింది.

By
en-us Political News

  
జగన్‌ నమ్మినబంటులా వ్యవహరించారన్న విమర్శులు ఎదుర్కొంటున్న శ్రీలక్ష్మి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం, లేదా ఏలూరు, నరసాపురం లోక‌సభ స్థానాలలో ఏదో ఒక చోట నుంచి ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో బెంగాల్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అంటే పరిశీలకులు మాత్రం ఆ అవకాశం ఇసుమంతైనా లేదంటున్నారు. బెంగాల్‌తో తెలంగాణను పోల్చడం సాధ్యం కాదని కుండబద్దలు కొడుతున్నారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాజకీయంగా భారీ వ్యత్యాసాలు ఉన్నాయి.
బాంకీపూర్ నియోజకర్గం దశాబ్దాలుగా బీజేపీ కి బలమైన కోటగా నిలబడుతోంది. 1995 నుండి ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విజయం సాధించారు. ఆయన తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ నియోజకవర్గానికి రాజీనామా చేశారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు, బయటి నుంచి వచ్చే రాజకీయ మద్దతుపై ఆధారపడటం మానుకోవాలని ఈ సందర్భంగా నితిన్ నబీన్ విస్పష్టంగా చెప్పారు. బయటి నుంచి మద్దతు లభిస్తుంది, దానితో ఎన్నికల్లో గెలిచేయవచ్చు అనే భ్రమల నుంచి తెలంగాణ బీజేపీ నాయకులు వెంటనే బయటకు రావాలనీ, . నాయకత్వంలో అలసత్వాని ఇకపై ఇసుమంతైనా సహించేది లేదనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఉప్పల్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ..
నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్..
మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.