లడ్డూ అంశంపై పవన్, ప్రకాష్ డైలాగ్ వార్!

Publish Date:Sep 24, 2024

Advertisement

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన అంశం మీద కేవలం తెలుగు రాష్ట్రాల్లోని వారు మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మాన్ని అనుసరించేవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆవేదనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర మనోవేదన చెంది ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పవన్ కళ్యాణ్‌ని ట్యాగ్ చేస్తూ,   'మీరు డిప్యూటీ సీఎంగా వున్న రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. విచారణ చేపట్టి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోండి. భక్తులకు అనవసర భయాలు కల్పించి... దీనిని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా ఎందుకు చేస్తున్నారు? మన దేశంలో ఇప్పటికే వున్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు' అని అన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. విజయవాడ కనకదుర్గ దేవాలయంలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, సున్నితమైన అంశాల మీద ప్రకాష్‌రాజ్‌ తెలుసుకుని మాట్లాడాలని అన్నారున. ప్రకాష్‌రాజ్‌తో పాటు అందరికీ చెబుతున్నానని, విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని సూచించారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్‌ వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్‌రాజ్ ఒక వీడియో సందేశం ద్వారా స్పందించారు. తాను చెప్పిన విషయాన్ని పవన్‌ కళ్యాణ్ అపార్థం చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను విదేశాల్లో సినిమా షూటింగ్‌లో ఉన్నానని, ఈ నెల 30 తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని అన్నారు ఈలోగా పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌ను మరోసారి చదివి అర్థం చేసుకోవాలని కోరుతున్నానని చెప్పారు.

పవన్ కళ్యాణ్ వీడియో సందేశానికి జనసేన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ప్రతిస్పందన వచ్చింది. డియర్ ప్రకాష్‌రాజ్ గారూ... 1. మీ ట్వీట్‌ను మేము సరిగానే అర్థం చేసుకున్నాం, డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టే ఈ అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  గారి నేతృత్వంలో చర్చించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ‘సిట్’ ఏర్పాటు చెయ్యడం జరిగింది. 2. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధమైన చర్య జరిగినప్పుడు ఇది ప్రతీ ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలి. కోట్లాది హిందువులతో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె తో తయారు చేసిన లడ్డూ తినేలా చేసినప్పుడు, ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిందే. 3. ఎక్కడైనా ఇతర మతాల వారిమీద ఘటనలు జరిగితే దేశంలో సెక్యులరిజం లేదు అని గగ్గోలు పెట్టే మీరు, 100 కోట్లకు పైగా హిందువుల విశ్వాసాలు దెబ్బతీసిన ఘటనపై దేశం స్పందించకుండా ఉండాలి అంటే ఎలా? 4. దేశంలో ఎన్నో గొడవలు ఉన్నాయి అంటున్నారు, వాటిలో మీకు ఒక వర్గానిదే తప్పు అన్నట్లుగా మీకు కనిపిస్తుంది, కారణాలు మీ రాజకీయ విధానాలు కావచ్చు, మాకు అనవసరం. ఇది హిందువుల మత విశ్వాసాలకు సంబంధించిన విషయం. మీకు పవన్ కళ్యాణ్  గారు చెప్పిన విషయం అర్ధం అవుతుంది అని అనుకుంటున్నాను. 5. సమస్య ఎవరిదైనా సరే గొంతెత్తి రాజకీయాలకు అతీతంగా మాట్లాడిన వ్యక్తి గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ విషయం వ్యక్తిగతంగా మీకు తెలుసు అని భావిస్తున్నాము. 6. బహుశా నేపాల్‌లో ఉన్నట్లున్నారు. అక్కడ హిందువులను ఒకసారి ఈ ఘటన గురించి స్పందన అడగండి, మీకు అర్థం అవుతుంది. దయచేసి కేంద్ర నాయకత్వంతో మీకు ఉన్న వ్యక్తిగత ద్వేషాన్నిఅందరిపై రుద్దాలని చూడకండి.... అని స్పందించారు.

By
en-us Political News

  
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.