క్లీన్ స్వీప్ కూటమి లక్ష్యం.. స్థానిక సమరంపై తెలుగుదేశం, జనసేన, బీజేపీ కీలక భేటీ.!

Publish Date:Jul 14, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమౌతోంది. 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం జనసేన, బీజేపీ కూటమి.. ఇప్పుడు రానున్న స్థానక ఎన్నికలలో కూడా క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటాలన్న కృత నిశ్చయంతో ఉంది.   రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నగారా మోగేందుకు ముహూర్తం దగ్గరపడిన  నేపథ్యంలో.. రాష్ట్రంలో రాజకీయవేడి రగులుతోంది.   ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో   స్థానిక ఎన్నికల జరిగే అవకాశం   ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు   సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం (జులై 15) జరగనుంది. 

సాధారణంగా సార్వత్రిక ఎన్నికల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నేతలు  ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇవి క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును నిరూపించే ఎన్నికలు. అయితే..  ఈ ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్ల కంటే, కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది పరిశీలకులు విశ్లేషణ.  ఒకే గ్రామంలో లేదా మండలంలో కూటమికి చెందిన వేర్వేరు పార్టీల నేతలు పట్టు కోసం ప్రయ

త్నించడం వల్ల అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు.  అందుకే అలాంటి పొరపచ్చాలు, టికెట్ల కేటాయింపు ఇబ్బందులు రాకుండా తీసుకోవలసిన  చర్యలు ఏమిటన్నదే బుధవారం (జులై 15) భేటీలో ప్రధాన అజెండా అని అంటున్నారు.  గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయ కమిటీలను  ఏర్పాటు చేసి, ఎలాంటి అసంతృప్తులు లేకుండా సీట్ల సర్దుబాటు చేయాలని కూటమి పార్టీల అగ్రనేతలు భావిస్తున్నారు. ఎ  స్థానిక ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తమ నాయకులను అలెర్ట్ చేశారు.ఈ కీలక భేటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ లతో పాటు కూటమికి చెందిన అగ్ర నాయకులందరూ హాజరు కానున్నారు.   అయితే..  సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్   ప్రత్యక్షంగా హాజరు కావడం లేదు. ఇటీవల ఆయన  ముంబైలోని కోకిలా బెన్ అంబానీ హాస్పిటల్ లో  భుజానికి సర్జరీ చేయించుకుని అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న సంగతి విదితమే.  
పవన్ ఈ సమావేశానికి ప్రత్యక్షంగా అటెండ్ కాకపోయినప్పటికీ, ఆయన సూచనల మేరకు జనసేన ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొని వ్యూహాలను ఖరారు చేయనున్నారు.  

Kutami Targets Clean Sweep Local Bodies Elections, AP Sarpanch Elections, Chandrababu Naidu, Pawan Kalyan Health Update, AP Local Body Polls, TDP Janasena BJP Coalition, AP Panchayat Elections 2026

By
en-us Political News

  
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు. తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ నేతల సమావేశం ఉద్రిక్తంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి.
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.