చంచల్ గూడ జైలుకు కేటీఆర్.. ఎందుకో తెలుసా?
Publish Date:Jun 4, 2026
Advertisement
సింగరేణి ఆస్తుల ధ్వంసం, మిలిటెంట్ తరహా పోరాటాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బాల్క సుమన్‌ను పరామర్శించడానికి బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్వయంగా చంచల్ గూడా జైలుకు వెళ్లారు. గురువారం (జూన్ 4) ఉదయం చంచల్‌గూడ జైలు వద్దకు చేరుకున్న కేటీఆర్ వెంట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు ఉన్నారు. జైలు నిబంధనల ప్రకారం ములాఖత్‌లో బాల్క సుమన్‌ను కలిసిన కేటీఆర్, ఆయనకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. బాల్క సుమన్‌పై బీఎన్ఎస్ సెక్షన్ 326 (జీ), 55, 61 (2), 351 (3), 353 (1), 152 తో పాటు ప్రభుత్వ ఆస్తుల నష్ట నివారణ చట్టం (పీడీపీపీ యాక్ట్) కింద కేసులు నమోదు చేశారు. ఇటు కేటీఆర్ కూడా సుమన్ ఆవేశంలో మాట్లాడిన మాటలు తప్పేనని అంగీకరిస్తూనే, ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు పెట్టిందని, దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని బీఆర్‌ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/ktr-visits-chanchalguda-jail-36-221761.html





