Publish Date:Oct 26, 2024
గత ఏడాది జనవరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. అంతే అప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాలలో తిరుగులేని నేతగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యాక్టివ్ రాజకీయాల నుంచి నిష్క్రమించేశారు. అధికారంలో ఉన్నంత కాలం, అంతకు ముందు తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో కూడా మాటల మాంత్రికుడు, రాజకీయ చాక్యుడు.. ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందే ఉంటారు. వారు వ్యూహ రచన చేయడానికి ముందే వాటికి విరుగుడు వ్యూహాలను అమలు చేసి వారిని నిరుత్తరులను చేస్తారు. కేసీఆర్ రాజకీయాలను తట్టుకోవడం కష్టం అంటూ అంతా వ్యాఖ్యానించిన కేసీఆర్ ఇప్పుడు మాటలే మరిచిపోయి మౌనిలా మారిపోయిన పరిస్థితి.
అయితే కేసీఆర్ మౌనం, ఆయన రాజకీయ ఇన్ యాక్టివ్ నెస్ బీఆర్ఎస్ కు శాపంగా పరిణమించింది.
కేసీఆర్ మౌనం నేపథ్యంలో పార్టీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావులు నడిపిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలకు పిలుపునిస్తూ, రేవంత్ సర్కార్ విధానాలపై ఘాటు విమర్శలు గుప్పిస్తూ, మరీ ముఖ్యంగా హైడ్రా, మూసీ బాధితులకు అండగా ఉంటామన్న భరోసా ఇస్తూ ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు. అయితే అది సరిపోవడం లేదు. వారు ఎంత దూకుడుగా ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నా కేసీఆర్ మౌనం పెద్ద లోటుగా కనిపిస్తోంది. ఎక్కడకు వెళ్లినా, ఏ వేదికపై ప్రసంగిస్తున్నా వారికి ఎదురౌతున్న ప్రశ్న కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారా? రాజకీయాల నుంచి నిష్క్రమించేశారా అన్న ప్రశ్నలే ఎదురౌతున్నాయి. ఆ ప్రశ్నలకు వారి సరిగా బదులు ఇవ్వలేకపోతున్నారని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.
తాజాగా ఉబీపీ కాంక్లేవ్ లో పాల్గొన్న కేటీఆర్ కు కేసీఆర్ మౌనం, యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరంగా ఉండటంపై ప్రశ్న ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం షాక్ నుంచి కేసీఆర్ ఇంకా తేరుకోలేదా? ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఎందుకు ఉంటున్నారు? అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి కేటీఆర్ చెప్పిన సమాధానం ఎవరినీ సంతృప్తి పరచలేకపోయింది. అంతే కాకుండా కేటీఆర్ మాట దాటేశారంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఇంతకీ కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఎందుకు ఉంటున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఏమిటంటే.. కేసీఆర్ ఓ అద్భుతమైన వ్యక్తి, ఆయన జీవితంలో చాలా చూశారు. ఆయనో ఉక్కు మనిషి. ఏం జరిగినా ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓటమి ఆయపై ఎలాంటి ప్రభావం చూపదు. చూపలేదు. అయినా.. మీరు అడగాల్సిన ప్రశ్న ఇది కాదు.. అంటూ తనకు అలవాటైన రాజకీయ ప్రసంగాన్ని ధారాళంగా చేసేశారు. అయన ఇంకా ఏమన్నారంటే.. మీరు కేసీఆర్ మౌనం గురించి కాదుకాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల వాగ్దానం ఏమైంది? వంద రోజుల్లో నెరవేరుస్తామన్న వాగ్దానాల సంగతేంటి? అని అడగాలి అని బదులిచ్చారు. కేసీఆర్ ఏబీపీ కాంక్లేవ్ వేదికగా ఇచ్చిన ఈ సమాధనం పట్ల పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. ఆయన మాటదాటేశారని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ మౌనం గురించి అడిగితే కేసీఆర్ రేవంత్ సర్కార్ పై విమర్శలు చేసి టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-skip-answer-for-question-about-kcr-39-187468.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.