Publish Date:Dec 24, 2024
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలంగాణ రాష్ట్రం మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా ప్రమేట్ చేసేవారు. అయితే ఆ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత నాటి కేటీఆర్ మాటలు అక్షర సత్యాలు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. వివాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, పరస్పర దూషణలతో తెలంగాణ రాష్ట్రం పొలిటికల్లీ మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా మారిపోయింది. నిత్యం ఏదో వివాదంతో జాతీయ స్థాయిలోనే తెలంగాణ రాష్ట్రం పతాక శీర్షికలలో నిలుస్తోంది.
ఇటీవలి సంవత్సరాలలో తొలిసారిగా ఆంధ్రాను అధిగమించి తెలంగాణ రాజకీయ వివాదాల్లో అగ్రపీఠిన నిలుస్తోంది. రాజకీయ విమర్శలు ఓ స్థాయి దాటి దూషణల పర్వానికి వెళ్లాయి. అటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలతో దూకుడు ప్రదర్శిస్తుంటే.. అంతకు మించి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అవకతవకలపై విచారణ, దర్యాప్తుల పేరిట కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ప్రభుత్వ ధనం దుర్వినియోగం విషయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయన అరెస్టు అనివార్యం అనుకుంటున్న పరిస్థితుల్లో ఆయనకు కోర్టు నుంచి తాత్కాలిక ఉపసమనం లభించింది. అయితే వెంటనే ఇదే విషయంలో ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఈ విషయం పక్కన పెడితే పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియోటర్ వద్ద జరిగన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఆ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్టు, మధ్యంతర బెయిలుపై విడుదల సంఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది.
అల్లు అర్జున్ వ్యవహారం తెరపైకి రాగానే కేటీఆర్ అరెస్టు, కేసుల విషయం ఒక్కసారిగా ఫేడౌట్ అయిపోయింది. ఫార్ములా ఇ రేస్ కేసులో ఈడీ దూకుడు పెంచడం, కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడానికి రెడీ అవుతోందన్న వార్తలకు సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ స్థానం లేకుండా పోయింది. ప్రజలు, మీడియా దృష్టి మొత్తం అల్లు అర్జున్ అరెస్టు, బెయిలు, తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఏపీకి తరలిపోతుందా అన్న దానిపైనే కేంద్రీకృతమై ఉంది. అసలు ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ చిక్కులలో పడ్డారు అన్న చర్చకు తావే లేకుండా పోయింది. మొత్తంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై ఈడీ కేసు విషయాన్ని జనం పట్టించుకోలేదని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-political-significance-fadeout-25-190286.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.