కెటీఆర్ ఓ అపరిచితుడు 

Publish Date:Aug 5, 2024

Advertisement

పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు దుర్మార్గునికి అందరూ తనలాగే చెడ్డవాళ్ళలా కనిపిస్తారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వంకుంట్ల తారకరామారావు వ్యవహారశైలి అదే అనిపిస్తోంది. గత అసెంబ్లీలో ఘోర పరాజయం తర్వాత ఈ బిఆర్ఎస్ నేత మాటలకు చేతలకు పొంతన లేకుండా మాట్లాడేస్తున్నారు. మొన్న పార్లమెంటు ఎన్నికల్లో జాతీయస్థాయిలో చక్రం తిప్పాలనుకున్న బిఆర్ఎస్ స్వంత రాష్ట్రంలో జీరోకి పడిపోయింది. ఆతర్వాతే బిఆర్ఎస్ ను టిఆర్ఎస్ ప్రయత్నాలను మమ్మురం చేశారు.  ఈ చర్చను కాసేపు పక్కన పెడితే తాజాగా కెటీఆర్ ఇచ్చే స్టేట్ మెంట్ చూస్తే ఆత్మాభిమానం అనుకోవాలో అహంకారం అనుకోవాలో చెప్పలేని పరిస్థితి.
తెలంగాణలో ఉపఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు. పార్టీ ఫిరాయింపులపై తమ పార్టీ ఢిల్లీలో న్యాయపోరాటం చేస్తుందన్నారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమైనట్లు తెలిపారు. త్వరలో సుప్రీంకోర్టులో పార్టీ తరఫున పిటిషన్ వేస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో తన ఆధ్వర్యంలో పార్టీ బృందం చర్చలు జరిపిందన్నారు. అటు రాజ్యాంగ నిపుణులతోనూ ఈ రోజు పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైందని వెల్లడించారు.ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్‌కు సంబంధించి సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు ఆర్యమా సుందరం తమ పార్టీ బృందానికి తెలిపారని వెల్లడించారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాన్చలేరన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్‌తో పాటు, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైనా స్పీకర్‌కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు.గతంలో బిఆర్ఎస్ మంచి మెజార్టీతో గెలిచినప్పటికీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఉండకూడదన్న దుగ్దతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించారు.తాను చేస్తే శృంగారం, ఇతరులు చేస్తే ... అన్నట్టు తయారైంది తెలంగాణ రాజకీయాలు. సుప్రీంకోర్టు తీర్పులతో పాటు న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఒకవైపు జాతీయస్థాయిలో పార్టీ ఫిరాయింపుల పైన సుద్దపూస ముచ్చట్లు చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. త్వరలో కోర్టుల సహాయంతో కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.తాను అధికారంలో ఉన్నప్పుడు చట్టాలు పట్టించుకోని కెటీఆర్ ఇపుడు చట్టాలే పరిష్కారమంటున్నారు. రెండు నాల్కల ధోరణితో కెటీఆర్ మాట్లాడుతున్నారు

By
en-us Political News

  
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
వందేళ్లు దాటినా తగ్గని ఉత్సాహం.. 101 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యాలు ఇవే.!
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న తరుణంలో, అమాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.