కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. డైనమిక్ యంగ్ పొలిటీషియన్ అని రోజా వంటి నేతల ప్రశంసలు అందుకున్న తెలంగాణ మంత్రి. ఒక్క మాటతో ఆయన ఏపీలో రాజకీయ దుమారం లేపేశారు. లేదు లేదంటూనే ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేశారు. ఏపీలో సౌకర్యాలపై సెటైర్ వేయడం ద్వారా తెలంగాణవైపు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి పెంచుకునేలా చేసుకున్నారు. కేసీఆర్ ఏపీలో విద్యుత్, రోడ్లు, నీళ్లపై చేసిన వ్యాఖ్యలు ఏపీతో పోలిస్తే తెలంగాణలో సౌకర్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పుకోవడానికే. ఏపీలో లేవని చెప్పడం ద్వారా ఆయన చిన్నగీత, పెద్దగీత సిద్ధాంతాన్ని వాడుకున్నారు.
అయితే ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నాయకుల స్పందన తీరు చూస్తే వారి పరిస్థితి మింగలేక..కక్కలేకా చందంగా తయారైందని అవగత మౌతుంది. ఎవరంగీకరించినా, అంగీకరించకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన తరువాత నుంచి రెండు రాష్ట్రాలలో రాజకీయాలు కంపేరిజంపైనే ఆధారపడి ఉన్నాయి. సెంటిమెంటు అనుకున్నా...రాజకీయ అనివార్యత అనుకున్నా..ఒక దాని కంటే ఒకటి అభివృద్ధి, సంక్షేమంలో ముందున్నామని ప్రచారం చేసుకోవడం ద్వారా లబ్ధి పొందాలన్నదే ఇరు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీల తాపత్రేయంగా ఉంది. 2019కి ముందు వరకూ అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణ వంటి అన్ని విషయాలలోనూ ఇరు రాష్ట్రాల మధ్యా పోటాపోటీ వాతావరణం ఉండేది.
అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. తెలంగాణ స్పీడ్ పెరిగితే..ఏపీ అభివృద్ధి గ్రాఫ్ దిగజారింది. అధికారిక గణాంకాలే ఈ విషయాన్ని స్పష్ట చేస్తున్నాయి. ఏపీలోని జగన్ సర్కార్ పూర్తిగా ఫ్రీ బీస్ మీద ఆధారపడి వచ్చే ఎన్నికలలో విజయానికి అవే శ్రీరామరక్ష అని భావిస్తూ ముందుకు సాగుతుంటే.. తెలంగాణ సర్కార్ అభివృద్ధి, సంక్షేమం, సెంటిమెంట్ అంటోది. ఈ నేపథ్యంలోనే తెలంగాణను ఏపీతో కంపేర్ చేస్తూ ప్రమోట్ చేసుకోవడానికి కేటీఆర్ క్రెడాయ్ సదస్సు వేదికను వినియోగించుకున్నారు. ఒకే సమయంలో అటు పెట్టుబడి దారులను ఆకర్షించడం, ఇటు ప్రజలలో ఏపీతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధి బ్రహ్మాండంగా ఉందన్న భావన క్రియేట్ చేయడం. తెలంగాణ ప్రజలలో కేటీఆర్ మాటల ప్రభావం ఎంతుందో తెలియదు కానీ, ఏపీలో మాత్రం కేటీఆర్ మాటలు దుమారమే లేపాయి. విపక్ష తెలుగుదేశం సహా వైసీపీ యేతర పార్టీలన్నీ కేటీఆర్ మాటలు అక్షర సత్యాలని ప్రకటిస్తూ...జగన్ సర్కార్ ప్రతిష్ట దెబ్బతినేలా తెలంగాణ అభివృద్ధిని పరోక్షంగానైనా సరే ఏపీ ప్రజలలో ప్రచారం చేస్తున్నారు. సీపీఐ నారాయణ, వైసీపీ రెబల్స్ రఘురామరాజు, డీఎల్ రవీంద్రా రెడ్డి వంటి వారైతే ఒక అడుగు ముందుకు వేసి మీడియా సమావేశాలలో పవర్ పాయింట్ ప్రజంటేషన్లు కూడా ఇచ్చేశారు.
దీంతో కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా కూడా ఏపీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఏపీ వెనుకబాటు తనం కేటీఆర్ మాటల సాక్షిగా ప్రజలలోకి వెళ్లిపోయింది. ఇప్పుడిక వైసీపీ సర్కార్ నష్ట నివారణకు తెలంగాణలో లోటుపాట్లను ఎత్తి చూపడంతో పాటు...ఏపీ ప్రగతికి తానేం చేసిందో చెప్పుకోవలసిన పరిస్థితిలో పడింది. ఇంత జరిగినా ముఖ్యమంత్రి జగన్ నోరు మెదపక పోవడం పరోక్షంగా కేసీఆర్ మాటలకు బలం చేకూర్చేదిగానే ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-gets-suppourt-in-ap-on-his-comments-39-135308.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.