కాంగ్రెస్ పార్టీతో కోమటిరెడ్డి తెగదెంపులు .. త్వరలో బిజెపి తీర్థం?
Publish Date:Jun 25, 2024
Advertisement
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కోమటి రెడ్డి ఉద్వాసన పలుకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజీనామా చేయబోతున్నారని త్వరలోనే బిజెపి తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి మెజార్టీతో గెలుపొందింది. పార్లమెంటు ఎన్నికలలో బిజెపి 8 స్థానాల్లో గెలుపొందింది. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బిజెపి నుంచి కాంగ్రెస్ లో చేరి గెలుపొందారు. ఇక నేడు ఆయన ఫైనల్ డెసిషన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారని, కొద్ది రోజుల్లోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్టే రాజకీయ విశ్లేషకులు. అంటున్నారు.
రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ , బిజెపిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కాంగ్రెస్ మంత్రి కోమటి వెంకట్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఢిల్లీలో కలుసుకున్నారు. కొద్ది సేపటి తర్వాత తెలంగాణ బిజెపి చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఒకే రోజు ఇద్దరు కేంద్ర మంత్రులను కులుసుకోవడం కాంగ్రెస్ మంత్రి కలుసుకోవడం చర్చనీయాంశమైంది. త్వరలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేరనున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న కోమటిరెడ్డి కాంగ్రెస్ కు దూరమౌతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిగ్ షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర మనస్తాపంతో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీని వీడటం కోసం రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
గతంలో తెలంగాణ పిసిసి చీఫ్, ఏఐసిసి పదవులు ఆశించిన ఆయన తనకు పదవులు లభించకపోవడంతో భంగపడ్డారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి బాహాటంగా వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇవ్వటంపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అప్పుడే ఆయన పార్టీ మారతారని ప్రచారం అరిగ్గింది. దీంతో పాటు సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపి తీర్థం పుచ్చుకున్న సమయంలో కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
తమ్ముడిని గెలిపించటం కోసం పని చేస్తున్నారని ఆయన కాంగ్రెస్ శ్రేణుల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ఆయన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఆయన తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. అయినప్పటికీ తమ్ముడు ఎఫెక్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై తీవ్రంగా పడింది. కాంగ్రెస్ పార్టీ నేతలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరం మరింత పెరిగింది.
http://www.teluguone.com/news/content/komatireddy-distance-from-congress-25-179416.html





