అన్నదానం చేస్తే సెంచరీ సాధిస్తావా.. ఇదేం పిచ్చి కోహ్లీ
Publish Date:Jul 16, 2022
Advertisement
అభిమానులు, వీరాభిమానులు కేవలం సినీ హీరో హీరోయిన్లకే కాదు క్రికెట్ హీరోలకీ వుంటారు. వారికీ, వీరికీ పిచ్చి దాదాపు ఒకే స్థాయిలో వుంటుంది. సినిమా సెంచరీ కొట్టాలని సినీ వీరాభిమానులు, మనోడు సెంచరీ కొట్టాలని క్రికెట్ వీరాభిమానులు ఎంత పనికయినా సిద్ధపడుతున్నారు. టాటూలు వేసుకోవడం చేసి పెద్ద వాళ్లు కాస్తంత ఖంగారెత్తారు.. ఏకంగా పూజలు, అన్నదానాలు.. వీటికి అంతే లేకుండా పోతోంది. వీళ్లని ఆపడం కోహ్లీలాంటి క్రికెట్ హీరో మళ్లీ సెంచరీ కొట్టాల్సిందే. అసలే ఫాన్స్‌కి హీరోగారి బ్యాట్ నుంచీ పరు గుల వరద లేదన్న దిగులు కమ్మేసింది. అయితే ఒక్కటి ఇలా అన్నదానాలు, పూజలు చేసేస్తే క్రికెట్ వీరుడు సెంచరీ కొట్టేస్తాడా? భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్రికెట్‌లో సచిన్ ద గాడ్ తర్వాత అంతటి క్రేజ్ వుంది. 33 ఏళ్ల కోహ్లీ తన 71వ అంతర్జాతీయ సెంచరీ కోసం దేశంలో విదేశాల్లోనూ వీరాభిమానులు వేయిన్నర కళ్లతో ఎదురుచూస్తూనే వున్నారు. కళ్లు కాయలు కాస్తున్నాయేగాని హీరోగారు మాత్రం అర్ధసెంచరీ మించడం లేదు. అంతెందుకు ఈమధ్యమరీ దారుణంగా ఆడుతున్నాడు. అయినా ప్రతి ప్లేయర్‌కి ఇలాంటి ప్యాచ్ వుంటుంది గురూ, మనోడి విషయంలో క్షమించేయండి అంటున్నారు మాజీ క్రికెటర్లు,, కోహ్లీ శిష్యగణం. కోల్‌కతా ఈడెన్ గార్డెన్‌లో బంగ్లాదేశ్ మీద ఆడిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేశాడు. అంతే ఆ తర్వాత అంతగా పరుగులు చేయలేకపోతున్నాడు. అతగాడు కెప్టెన్ బాధ్యతలు వదిలేసుకున్న తర్వాత ఆ ఒత్తిడి తగ్గింది గనుక ఇహ మనోడు కొట్టేస్తాడనుకున్నా ఆ ఆనందం ప్రేక్షకులకు, వీరాభిమా ను లకు కలగడం లేదు. నరాల బలహీనత నుంచి కోలుకుని భారత వన్ డే జట్టులోకి వచ్చిన తర్వాత మరీ దారుణంగా 25 బంతుల్లో కేవలం 16 పరుగులే చేసి నిరాశపరిచాడు. కోహ్లీ లో ఇంకా ఆడే శక్తి వుందని ప్రస్తుతం కొంత ఇబ్బందిపడుతున్నాడే గాని టాప్ స్టార్ స్థాయికి తగ్గలేదని, అతని సత్తా గురించి ఏ మాత్రం అనుమానించక్కర్లేదని భారత్ కెప్టెన్ శర్మ కూడా కితాబునిచ్చాడు. అందువల్ల మున్ముందు టెస్ట్ సిరీస్ లో సెంచరీ చేస్తాడనే ఎదురుచూడాలి.
http://www.teluguone.com/news/content/kohli-fan-madness-25-139884.html





